Home తాజా వార్తలు 10 శాతం ఇండ్లు మైనార్టీలకే కేటాయిస్తాం

10 శాతం ఇండ్లు మైనార్టీలకే కేటాయిస్తాం

  CMKCR

హైదరాబాద్: డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లలో  పది శాతం మైనార్టీలకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ముస్లింలకు 100 శాతం సబ్సిడీతో రూ.2.5 లక్షల వరకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ముస్లింలకు ప్రత్యేక పారిశ్రామికవాడ, ఐటి కారిడార్, కోకాపేటలో పది ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఇస్లామిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియమిస్తానని, హైదరాబాద్ లోక్‌సభకు ఎస్‌డిఎఫ్ నుంచి రూ.40 కోట్లు ఖర్చు చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు.