Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రూ.10 సిక్కాలు చెల్లవని పుకార్లు

10-Coins

న్యాల్‌కల్: సాంకేతికంగా పరవళ్లు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా అక్షరాస్యులు అమాయకులుగా ప్రవర్తిస్తున్నారు. అక్షర జ్ఞానం లేనోడికి ఉన్న తెలివి అక్షరాస్యులకు ఉండటం లేదనేలా ప్రవర్తి స్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సంఘటన నుంచి కోలుకుంటున్న వ్యాపారు లు, ప్రజలు సోషల్ మీడియాకు ప్రభావితులవుతున్నారని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… నోట్లను రద్దు చేస్తే రిజర్వు బ్యాంక్ బాధ్యులు పత్రిక, టివి ఛానళ్ల ద్వార ప్రకటన చేస్తారు. అలాంటి ప్రకటనలు ఏమి విడుదల కాకున్నా మండలంలోని ఆయా గ్రామాల్లో 10 రూపాయల సిక్కాలు చెల్లడం లేదని పుకార్లు ఊపందు కున్నాయి.

వ్యాపారుల వద్దకు 10 రూపాయల సిక్కాను తీసుకెళితే అది చెల్లదంటూ వ్యాపారులు వినియోగదారున్ని వెనక్కి పంపిస్తున్నారు. సిక్క చెల్లదంటే చెల్లదంటూ వ్యాపారులు వినియోగదారులతో వాదిస్తు న్నారు. రిజర్వు బ్యాంక్ వారు ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయలేదని, సిక్కచెల్లదంటే ఎలాగంటూ వినియోగదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే అక్షరాస్యులైన వ్యాపారులు సైతం సిక్కాలు తీసుకోకపోవడం విస్మయన్ని కల్గిస్తోంది. సిక్కలు రద్దయితే పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలు ప్రచురితమవుతుందని, టివి చానళ్లు అదే పనిగా ప్రచారం నిర్వహిస్తాయని అక్షరాస్యులైన వ్యాపారులు గమనించకపోవడం విడ్డూ రంగా ఉందని నిరక్షరాస్యులు మదనపడుతున్నారు. రిజర్వు బ్యాంక్ వారు ఇటీవలే 10 రూపాయల సిక్కాలు విడుదల చేసింది. విడుదల చేసిన కొన్ని సంవత్సరాలకే రద్దు చేయదని నిరక్షరాస్యులు అంటుం డగా కొందరు అక్షరాస్యులు మాత్రం అదే పనిగా సిక్కలు చెల్లడం లేదం టూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శ నమని చెప్పవచ్చు.

సిక్కాలు రద్దు కాలేదు – బ్యాంక్ మేనేజర్ ఫణీందర్‌శర్మ…

10 రూపాయలు సిక్కాలు చెల్లడం లేదంటే ప్రచారం ఊపందుకోవ డంతో అటు ప్రజలు, ఇటు వ్యాపారులు అయోమయానికి గురవుతున్న విషయాన్ని ‘మన తెలంగాణ’ సిండికేట్ బ్యాంక్ మేనేజర్ ఫణీందర్ శర్మ దృష్టికి తీసుకుపోగా అలాంటిదేమి లేదన్నారు. 10 రూపాయల సిక్కా లు అమలులోనే ఉన్నాయని, పుకార్లను వ్యాపారులు, ప్రజలు నమ్మ వద్దన్నారు.

Comments

comments