Home ఆఫ్ బీట్ వీడియోలు టాప్ లెస్‌గా టాప్ టెన్నిస్ స్టార్ గానం..!(వీడియో)

టాప్ లెస్‌గా టాప్ టెన్నిస్ స్టార్ గానం..!(వీడియో)

Tennis Star Serena Williams Breast Cancer Awareness Video

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రపంచ టాప్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ టాప్ లెస్‌గా పాట పాడారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ మంత్(అక్టోబర్) సందర్భంగా సెరెనా ‘ఐ టచ్ మై సెల్ఫ్’ అనే పాటను పాడారు. మహిళలు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని గుర్తు చేస్తూ ఆమె ఈ పాటను ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా తన సొంత గాత్రంతో వీడియో రికార్డు చేసి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్టు చేశారు. వీడియోతో పాటు ‘‘ఇది నాకంత సౌకర్యంగా లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్ ప్రభావితం చేస్తోంది, వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ పని చేస్తున్నా’’నని ఆమె చెప్పారు. అలాగే ‘‘ బ్రెస్ట్ క్యాన్స ర్‌ను ముందుగానే ఈ వ్యాధిని గుర్తించడం ముఖ్యం. అలా చేయడం వల్ల దాన్ని నివారించడం సులవు అవుతుందని, ఇది చాలా ప్రాణాలను కాపాడుతుందని సెరెనా చెప్పుకొచ్చారు. వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని మహిళలందర్నీ ఈ వీడియో గుర్తు చేస్తుందని భావిస్తున్నా’’  అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మహిళ్లలో వచ్చే రొమ్ము క్యాన్సర్ విషయంలో వయసుకూ, వ్యాధికీ చాలా దగ్గరి సంబంధం ఉంది. అంటే వయసు పైబడుతున్నకొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. సొ.. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(Courtesy By: The Guardian)