Home జాతీయ వార్తలు రాజాజీ హాల్ వద్ద ఉద్రిక్తత

రాజాజీ హాల్ వద్ద ఉద్రిక్తత

Chennai : Tension at Rajaji Hall

చెన్నయ్ : తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రాజాజీ హాల్‌లో ప్రజల, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ఆయన్ను కడసారి చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి డిఎంకె కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున రాజాజీ హాల్ వద్దకు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సంయమనంగా ఉన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రియతమ నేతను దగ్గరగా చూడాలని రాజాజీ హాల్‌లోకి చొచ్చుక వెళ్లేందుకు యత్నించారు. బారీకేడ్లను దాటుకుని కరుణానిధి పార్థివదేహం వద్దకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ ఘటనలో 26 మంది గాయపడ్డారు. రాజాజీ హాల్ వద్ద ఉన్న వారిని పోలీసులు చెదరగొట్టారు. రాజాజీ హాల్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tension at Rajaji Hall