Home జాతీయ వార్తలు ప్రిన్సిపాల్‌పై విద్యార్థి కాల్పులు…

ప్రిన్సిపాల్‌పై విద్యార్థి కాల్పులు…

Tenth class student shoots principal in up

ఉత్తరప్రదేశ్: ఓ పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపాల్‌పై పిస్టల్‌తో కాల్పులు జరిపిన ఘటన యుపిలోని బిజ్నోర్ జిల్లా సేవహారా పట్టణంలో శ్రీసాయి ఇంటర్ కాలేజీలో గురువారం చోటుచేసుకుంది. సుధాంశు అనే విద్యార్థి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్‌ను దవాఖానకు తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. తోటి విద్యార్థిపై దాడి చేయడానికి దీపాంశును స్కూలు నుంచి యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీంతో కోపం పెంచుకున్న అతడు ఈ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం విద్యార్థి పరారీరో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.