Home జయశంకర్ భూపాలపల్లి బ్యాలెట్ బాక్స్‌లకు చెదలు

బ్యాలెట్ బాక్స్‌లకు చెదలు

Ballot Boxesజయశంకర్ భూపాలపల్లి :   గత నెల ఎంపిటిసి, జడ్ పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో పలు చోట్ల బ్యాలెట్ బాక్స్ లకు చెదలు పట్టింది. చెదలు కారణంగా బ్యాలెట్ పేపర్లు చిరిగిపోవడంతో మహాదేవ్ పూర్ మండలం సూరారం, అంబటిపల్లి గ్రామల్లో ఎంపిటిసి, మహాదేవ్ పూర్ లో జడ్ పిటిసి ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. చెదలు పట్టిన బ్యాలెట్ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు చెదలు పట్టిన బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు. ఈ మూడు స్థానాల్లో రీ పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Termite To Ballot Boxes In Jayashankar Bhupalpally