Home అంతర్జాతీయ వార్తలు మారణ హోమం

మారణ హోమం

Terror Attacks Zealandక్రైస్ట్ చర్చిలోని రెండు మసీదుల్లో ఆస్ట్రేలియన్ కాల్పులు, 48 మంది క్షతగాత్రుల్లో ఇద్దరు హైదరాబాద్ వాసులు, ఒకరు విషమం

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌లో సాయుధ దుండగులు మారణహోమం సృష్టించారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లోకి తుపాకులతో చొరబడి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 49మంది చనిపోయా రు. మరో 48మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో 20మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సాయుధు డైన ఆస్ట్రేలియన్ వాసిని గుర్తించి కేసు నమోదు చేశారు. మరి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ ఉన్నారు. క్షతగాత్రుల్లో హైదరా బాద్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. శుక్రవారం కావడంతో క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు ఎక్కువ మంది వచ్చారు. వీరిని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.45గంటల ప్రాంతంలో నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఘటనా సమయంలో అల్ నూ ర్ మసీదులో దాదాపు 300 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జరిపిన కాల్పుల్లో 30మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మసీదులో చాలా మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిపోయిందని, ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పరుగులు పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దాడి సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా మసీదు సమీపంలోనే ఉన్నారు. అయితే వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్ది క్షణాలకే లిన్‌వుడ్ మసీదులో మరో ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఆయుధాలతో ఉన్న ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి లెన్ పెనెహ మాట్లాడుతూ నల్ల దస్తులు వేసుకున్న వ్యక్తి తుపాకీతో మసీదు గుమ్మంలోకి వచ్చే రాగానే కాల్పులు మొదలు పెట్టాడని, దీంతో జనం పరుగులు పెట్టడం చూశానని అన్నాడు.

సెమీ అటోమెటిక్ తుపాకీతో గుళ్ల వర్షం కురిపించి కాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత పారిపోయాడని వివరించారు. ఒక చోట దాక్కున తాను ఆ తర్వాత మసీదులోకి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నానని పెనెహ ఉదేగంతో చెప్పారు. ఎక్కడ చూసిన శవాలు, రక్తపు మరకలే మసీదు నిండా ఉన్నాయని, కొందరు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఎలా పాల్పడుతారో అర్థం కావడం లేదన్నారు. మసీదు పక్కనే తమ నివాసం అని, ఇక్కడికి ప్రార్థనల కోసం వచ్చి పరిసర ప్రజలు అంతా ఎంతో స్నేహపూర్వకంగా మెదులుతారని అన్నారు.

ప్రత్యక్ష ప్రసారం చేసిన దుండుగుడు..

అల్ నూర్ మసీదు వద్ద కాల్పులకు తెగబడ్డ దుండగుడు దాడినంతా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు న్యూజిలాండ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్ స్ట్రీమింగ్ జరిగినట్లు తెలిపాయి. ఆ వీడియో ప్రకారం దుండగుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా తెలుస్తోంది. హెల్మెట్, దానికి కెమెరా ధరించి కారులో వచ్చిన దుండగుడు అల్ నూర్ మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపాడు. ఆ తర్వాత మసీదులోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. అయితే ఈ లైవ్‌స్ట్రీమ్ వీడియోను షేర్ చేయరాదంటూ న్యూజిలాండ్ పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రణాళిక ప్రకారం

జరిగిన దాడే : న్యూజిలాండ్ ప్రధాని ఈ కాల్పుల్లో 49 మంది మృతిచెందినట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిందా ఆర్డెర్న్ కూడా వెల్లడించారు. ఇది ప్రణాళిక ప్రకారం చేసిన ఉగ్రదాడిగా ఆమె అభివర్ణించారు. బాధితుల్లో అత్యధికులు వలస వచ్చినవారేనని, న్యూజిలాండ్‌ను సొంత ఇల్లుగా భావించి ఇక్కడి వచ్చిన వారేనని పేర్కొన్నారు. న్యూజిలాండ్ చరిత్రలో ఇది చీకటి రోజని, హింసకు ఇది మరింత తీవ్రమైన రూపమని అన్నారు. ఈ మారణహోమంతో సంబంధం ఉన్న నలుగురిలో ఒకరు అస్ట్రేలియన్ వాసేనని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Terror Attacks at New Zealand Mosques 49 People Dead