Home అంతర్జాతీయ వార్తలు బంగ్లాదేశ్‌లో టెర్రరిజం

బంగ్లాదేశ్‌లో టెర్రరిజం

Terrorismబంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ మిలిటెన్సీ పెచ్చు పెరుగుతున్న ఆనవాళ్లు బలంగా కనిపిస్తున్నాయి. గతేడాది స్వేచ్ఛయు తమైన ఆలోచనాపరులపై దాడులు జరగడం, ఈ ఏడా ది విస్తృత లక్ష్యాలపై గురిపెట్టిన ఘటనలు పెరగడం బట్టి ఈ నిర్ధారణకు రావాల్సి వస్తోంది. విదేశీ టెర్రిస్టు సంస్థలు తమ దేశంలో లేవని అవామీలీగ్ ప్రభుత్వం చెబుతోంది. తన రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బిఎన్‌పి), జమాత్-ఎ- ఇస్లామి కూటములే ఈ తిరుగుబాట్లకు కారణమని ప్రభుత్వం అంటోంది. బిఎన్ పి- జమాత్ మాత్రం ప్రభుత్వ అణచివేత విధానాలే కార ణమని ప్రత్యారోపణ చేస్తున్నాయి. ఇదే అభిప్రాయాన్ని క్రిమినల్ చట్టాల నిపుణుడు, మానవ హక్కుల కార్యకర్త టోబీ కాడ్‌మాన్, బంగ్లాలో అమెరికా మాజీ రాయబారి విలియమ్ బి మిలమ్ కూడా వ్యక్తం చేశారు. అవామీ లీగ్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించే డేవిడ్ బెర్గ్‌మ్యాన్ కూడా ప్రతిపక్షం పట్ల అధికారపార్టీ దురుసుగా ప్రవర్తి స్తున్నట్లు విమర్శించారు. బంగ్లాదేశ్‌లో హఠాత్తుగా టెర్ర రిజం పడగ విప్పినట్టు ప్రకటించి బెర్గ్ మ్యాన్ కలకలం రేపారు.
అణచివేతకు అవామీ మార్గాలు
అవామీలీగ్ ఏకఛత్రాధిపత్య ధోరణి తెలియనిది కాదు. అందులో ప్రతిపక్ష నాయకులపై కేసులమీద కేసులు బ నాయించడం ఒకటి. ఆయా పార్టీల కార్యకర్తలను సా మూహికంగా అరెస్టు చేయడం మరో ఉదాహరణ. మిలి టెంట్లుగా అనుమానిస్తున్న వారు ఉన్నట్టుండి మాయమ వుతారు. లేదా హత్యకు గురవుతారు. ప్రధాన స్రవంతి రాజకీయాలను, సోషల్ మీడియాను కూడా అణచివేసే ధోరణులు బంగ్లా ప్రభుత్వానికి సర్వ సాధారణం. ఈ చర్యలను సరైన కారణాలపైనే సాగిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. అసమ్మతి వాదులను ఉద్దేశ పూర్వకంగా దె బ్బతీయడం కోసం జరిపే సైబర్ దాడులకు ఒక్కోసారి సామాన్యులు అన్యాయంగా బలవుతున్నారు. అవామీ లీగ్ 2009నుంచి అధికారంలో ఉంది. 2003 లో బిఎన్‌పి-జమాత్ కూటమి ఆఖరి పదవీకాలంలో దే శంలో అంతుబట్టని మరణాలు మొదలయ్యాయి. 200 7-08లో సైన్యం మద్దతు గల తాత్కాలిక ప్రభుత్వం అం తకు ముందుగాని, తరువాత గాని ఎన్నడూ లేని విధం గా పౌర హక్కులను సంపూర్తిగా రద్దు చేసింది. అలాగే ఒక టెలివిజన్ చానెల్‌ను మూసివేసింది. అయితే అవా మీలీగ్ లోపాలకు పాత ప్రభుత్వాల తప్పులు సమర్ధన కాబోవు.
బంగ్లా రాజకీయాలలో మత ప్రసక్తి చరిత్ర
ప్రత్యర్థుల అణచివేత ఉదంతాలను గత పాలకులనుంచి వారసత్వంగా వస్తున్న భ్రష్ట రాజకీయ సంప్కృతిలో భా గంకాక కేవలం అవామీలీగ్ పాలనలోనే సంభబించిన విగా ప్రభుత్వ విమర్శకులు పేర్కొంటారు. బిఎన్‌పి- జ మాత్ తరఫు విమర్శకులు టెర్రర్ మూల కారణాలపై, బంగ్లాలో ఇస్లామ్ రాజకీయాలను ఎవరు ప్రవేశ పెట్టారు అనే విషయంపై చర్చలో దొరకకుండా జారిపోతారు. బంగ్లాదేశ్‌లో తీవ్రవాద హింసాకాండగా ఇస్ల్లామ్ రాజకీ యాలు మార్పు చెందినది ఎవరి వలన అన్న విషయం లో కూడా వారి వాదన ముందుకు సాగదు. బిఎన్‌పి వ్య వస్థాపకుడు జియా ఉర్ రెహమాన్ 1970లలో జమాత్ కు రాజకీయాలలో పునరావాసం కల్పించారు. దశాబ్దా ల తరువాత 2001లో బిఎన్‌పి-జమాత్ పాలనలో జ మాత్-ఉల్- ముజాహిదీన్ బంగ్లాదేశ్, హర్కత్-ఉల్- జీహాద్ బంగ్లాదేశ్ సంస్థలు నేరుగా బలం పుంజుకొన్నా యి. 2015 నుంచి అవి జరిపిన రెండు డజన్ల దాడు లలో 140 మంది మరణించారు. ఈ సంఖ్య ఇస్లామిస్టు లు జరిపిన దాడులలో మృతి చెందిన వారి కంటే 100 ఎక్కువ. వారు ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాను గురిపెట్టి బాంబు దాడులు చేశారు. 2004లో జరిగిన ఈ దాడిలో ఆమె కొద్దిలో తప్పించుకొన్నారు. కానీ ఆమె పార్టీ అగ్ర నాయకులిరువురూ, కొందరు పౌరులు మరణించారు. వేరే బాంబు దాడిలో అవామీలీగ్ మాజీ ఆర్థిక మంత్రి ఎస్‌ఎఎం కిబ్రియా మరణించారు. ప్రజాస్వామ్యం నెల కొన్న అనంతర బంగ్లాదేశ్‌లో ప్రతిపక్ష నాయకులపై టె ర్రరిస్టు దాడులు జరగడం అదే మొదటిసారి.
హిందూ మైనారిటీలపై బిఎన్‌పి-జమాత్ దాడులు
హిందూ మైనారిటీలకు వ్యతిరేకంగా అత్యంత తీవ్రమైన దాడులకు బిఎన్‌పి- జమాత్ కూటమి ఆధ్వర్యం వ హించింది. 2001లో అధికారంలోకి వచ్చిన వెనువెంట నే ఈ దాడులు సాగించింది. ఖ్వామీ మదర్సాల సంఖ్య 2001-2006 కాలంలో బాగా పెరిగింది. అవి తీవ్రవా దానికి తర్ఫీదు కేంద్రాలుగా తయారయ్యాయి. జమాత్ వలెనే పశ్చిమాసియానుంచి దిగుమతి అయిన చాందస ఇస్లామ్ వాదాన్ని అవి నూరిపోస్తాయి. మత సహనంతో స్థానికులు అనుసరించే సరళ మత వాదాన్ని మదర్సాలు దెబ్బ తీస్తాయి అన్న భావన ఉంది.
టెర్రరిస్టులతో దృఢంగా వ్యవహరించని ప్రభుత్వం
బలంగా తలెత్తుతున్న టెర్రిస్టులతో దృఢంగా అవామీలీగ్ వ్యవహరించలేక పోతోంది. విధాన లోపంలో అది కొట్టు మిట్టాడుతోంది. ఇక జమాత్ రాజకీయ ఇస్లామ్ వైఖరిని విడిచిపెట్టాలి. అవామీ ప్రభుత్వాన్ని సమస్య మూల కా రణంగా చూపే వైఖరిని ప్రతిపక్షం విడనాడాలి. ప్రభుత్వ అణచివేత విధానాలే బంగ్లాదేశ్‌లో టెర్రరిజం తలెత్తడా నికి కారణమని మితవాద విమర్శకులు ఆరోపించడం విడ్డూరం. ఏకచ్ఛత్రాధిపత్య పాలనను బంగ్లాదేశ్ ఇదే తొ లిసారిగా చూడటం లేదు. గతంలో రెండేళ్ల పాటు సాగిన తాత్కాలిక ప్రభుత్వం ఎమర్జిన్సీవలె పాలన సాగించింది. 1970, 1980 దశకాల నాటి నియంతృత్వ పాలనలకు వ్యతిరేకంగా, అణచివేతలపై అవామీలీగ్, బిఎన్‌పి పోరా డాయి. హింసాకాండకు పాల్పడకుండా పోరాటాలు చేశాయి.
నేటి టెర్రరిజం కొత్తరకం
కానీ వర్తమాన కాలంలో కొత్తరకం టెర్రరిస్టు విభాగాలు వెలిశాయి. రాజకీయ వాతావరణం క్రమంగా కలుషిత మవడంతో అవి తలెత్తాయి. 2001 నుంచి బిఎన్‌పి మ తపరంగా మత వాదాన్ని వరించడంతో రాజకీయ వాతా వరణం దిగజారింది. అయితే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యా లు లేవని చెప్పటంలేదు. స్వేచ్ఛా భావనలుకల వారిపై ఉన్నతస్థాయి అవామీ నేతలు విమర్శల దాడి చేశారు. మత విశ్వాసాలతో ఆడ్డుకోవద్దని హెచ్చరించారు. బాధి తులనే నిందించే ఈ విధమైన ధోరణి ప్రభుత్వం ఎంతగా రాజకీయాలలోకి మతాన్ని చొప్పింప చూస్తోందో తెలు స్తోంది. ప్రతిపక్షం విడవకుండా మతం కార్డును ఆడ్డం తో ప్రభుత్వం కూడా అదే ఆట ఆడదలిచింది.