Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

అచాబల్‌లో ఉగ్రవాదుల కాల్పులు

firing

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతనాగ్‌లోని అచాబల్‌ ప్రాంతంలో పిడిపి నేత బహిరంగసభలో ప్రసంగిస్తున్న సమయంలో ఉగ్రవాదులు సభకు హాజరైన ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు పెట్టారు. తక్షణమే స్పందించిన పోలీసులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. శ్రీనగర్, బుద్గాం, గండేర్‌బల్ ప్రాంతాల్లో ఆదివారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల నిర్వహణకు వచ్చిన పోలింగ్ సిబ్బందిపై , స్టేషన్లపై కొందరు వ్యక్తులు దాడులు చేశారు. బుద్గాం జిల్లాలోని పోలింగ్ స్టేషన్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిపై రాళ్లు రువ్వారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Comments

comments