Home తాజా వార్తలు షాద్ నగర్‌లో ఉగ్ర కలకలం

షాద్ నగర్‌లో ఉగ్ర కలకలం

Breaking-Newsహైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పరిధిలోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఉగ్ర కలకలం రేగింది. ఎన్‌ఐఎ అధికారుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారన్న సమాచారంతో బాషా అనే వ్యక్తి ఇంటిని ఎన్‌ఐఎ భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాంతో అనుమానిత వ్యక్తులు భద్రతా దళాలపై కాల్పులు జరిపినట్టు సమాచారం. ఎన్‌ఐఎ ఎదురు కాల్పులు జరపడంతో అనుమానిత ఉగ్రవాది చనిపోయినట్లు తెలిసింది. చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని, మరో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.