Home జాతీయ వార్తలు పోలీసును కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

పోలీసును కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

po

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి కిడ్నాప్ చేశారు. కతువాలో ట్రైనింగ్‌లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ సెలవు మీద తన స్వస్థలానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు అపహరించారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పోలీసు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. పుల్వామా జిల్లాలో జూన్ లో జవాన్ ఔరంగజేబ్‌ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. రంజాన్ పండుగను తన కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి ఔరంగజేబ్ తన సొంతూరుకు బయల్దేరిన కొద్దిసేపటికే మార్గమధ్యంలో ఉగ్రవాదులు అతన్ని అపహరించి దారుణంగా హత్య చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి దక్షిణ కశ్మీర్‌లో టెర్రర్ గ్రూపులు తమ కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు పోలీసులపై దాడులు చేసి వారి దగ్గరున్న ఆయుధాలను అపహరించుకుపోతున్నారు.