Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కానిస్టేబుళ్ల  దేహదారుఢ్య పరీక్షలు

consatables-exasజెఎన్‌ఎస్ స్టేడియంలో అభ్యర్థుల పరుగు పరీక్షను ప్రారంభిస్తున్న
సిపి సుధీర్‌బాబు

వరంగల్ క్రైం : వరంగల్ పోలీసు కమిషనరేట్, వరంగల్ రూరల్ పోలీసు శాఖల పరిధిలో నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు ఆదివారం మూడవ రోజు ప్రశాంతంగా ముగిశా యి. గతంలో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు హన్మకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుళ్లకు జెఎన్‌ఎస్ స్టేడియంలోను, వరంగల్ రూరల్ పరిధిలోని అభ్యర్థులకు కేయు మైదా నంలో 800, 100 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ తదితర దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. రూరల్ పరిధిలో ఆదివారం 730 మందికి పరీక్షలను నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 966 మందికి ఈపరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలో తుది వ్రాత పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈపరీక్షలను వరంగల్ పోలీసు కమిషనర్ గొట్టె సుధీర్‌బాబు, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝాలు ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వ హిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ అదనపుపు ఎస్పి జాన్‌వెస్లీ, ఏఆర్ అదనపు ఎస్‌పి ప్రవీణ్‌కుమార్, ములుగు ఎఎస్‌పి విశ్వజిత్ కంపాట్, నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, ఎఆర్ డిఎస్‌పిలు మురళీధర్, సుదీంద్ర, రాజమహేందర్, రాంచందర్‌రావు, కమిషనరేట్ పరిధిలోని అదనపు డిసిపి యాదయ్య, పరిపాలన విభా గం అధికారిని స్వరూపరాణి, ఎసిపిలు శోభన్‌కుమార్ జనార్థన్, మహేందర్, సురేంద్ర నాథ్, వెంకటేశ్వర్‌రావు, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేష్‌కుమార్‌ల తో పాటు, కమిషనరేట్, రూరల్ పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్ ఐలు పాల్గొన్నారు.

Comments

comments