Search
Monday 23 July 2018
  • :
  • :

మ్యూజియంగా మారనున్న థాయ్‌లాండ్ గుహ

హాలీవుడ్ సినిమాగా రెండు వారాల ఆపరేషన్ 

Thailand-Cave

మే సాయి :  థాయ్ లాండ్‌లోని థామ్ లాంగ్ గుహ నుంచి 12 మంది యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లతో పాటు వారి కోచ్‌ని రక్షించిన ప్రదేశం మ్యూజియంగా మారనుంది. ప్రస్తుతం ఈ గుహని కూల్చి వేస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠతతో  రెస్కూ ఆపరేషన్ రెండు వారాలపాటు సాగింది. ఈ మొత్తం ఆపరేషన్‌ని సినిమా తీయాలని హాలివుడ్ ప్రొడక్షన్  హౌజ్ నిర్ణయించింది.ఈ సినిమాలో ఆపరేషన్‌లో పాల్గొన్న డైవర్స్, గుహలోని వారు, వైల్డ్ బోర్స్  ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన  వైద్య బృందం ప్రధాన పాత్రలుగా సినిమా నిర్మిస్తామని తెలిపింది.

  ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ఆశ్చర్యకరమైన దృశ్యాలను నేవీ సీల్స్ అధికారులు విడుదల చేశారు. 11 నుంచి 16 సంవత్సరాల వయసు గల ఫుట్‌బాల్ టీం బాలలను, 25 యేళ్ల కోచ్‌ని రక్షించిన తీరుని కళ్ల ముందుంచారు. గుహ నుంచి రక్షింపబడిన వారు  ప్రస్తుతం ఆసుపత్రి బెడ్లపై కేరింతలు కొడుతూ కనపడుతున్నా, వారిని ఇతర పేషంట్ల నుంచి వేరుగా ఉంచారు. వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఎటువంటి ఇన్‌ఫెక్షన్ సోకకుండా డాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comments

comments