Home అంతర్జాతీయ వార్తలు సురక్షితంగా బయటపడ్డ థాయ్ బాలురు…

సురక్షితంగా బయటపడ్డ థాయ్ బాలురు…

Thai

థాయ్‌లాండ్: ప్రపంచవ్యాప్తంగా థాయ్‌లాండ్ చిన్నారుల సంఘటనకు సంబంధించిన ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది. 18 రోజులుగా గుహలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గడిపిన చిన్నారులను ఒక్కొక్కరిగా సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్ టీం కోచ్ తో పాటు 12 మంది పిల్లలను 19 మంది డైవర్లతో కూడిన రెస్క్యూ టీం అధికారులు సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. ఆదివారం జులై 8వ తేదీన సహాయక చర్యలు ప్రారంభించిన సిబ్బంది నలుగురిని కాపాడారు. తర్వాత రోజు మరో నలుగురిని కాపాడారు. మంగళవారం మిగిలిన ఐదుగురిని సురక్షితంగా కాపాడింది రెస్క్యూటీం. జూన్ 23వ తేదీన గుహలోకి వెళ్లిన ఫుట్‌బాల్ టీం అక్కడే చిక్కుకున్న సంగతి తెలిసిందే.