Search
Friday 21 September 2018
  • :
  • :

నితిన్ చిత్రానికి తమన్ మ్యూజిక్

SS-Thamanసౌతిండియాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. పలువురు స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించి అతను తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు తమన్… యంగ్ హీరో నితిన్ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇప్పటివరకు నితిన్ చిత్రాలకు ఎక్కువగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చేవాడు. కానీ ఈసారి మాత్రం నితిన్ కొత్త హోమ్ ప్రొడక్షన్‌లో తెరకెక్కే చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తాడు. తొలిసారి నితిన్-తమన్ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. నితిన్ తండ్రి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్‌లు కో-ప్రోడ్యూసర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది.

Comments

comments