Home తాజా వార్తలు ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ సాంగ్ విడుదల

‘వినయ విధేయ రామ’ ఫస్ట్ సాంగ్ విడుదల

Vinaya Vidheya Ramaహైదరాబాద్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘వినయ విధేయ రామ’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘తందానె తందానె’ విడుదలైంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు వినసొంపైన బాణీలు అందించారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వాని నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందు తున్న ఈ సినిమాను స్టార ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా  జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహలు చేస్తుంది.