Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నా భర్త ఆత్మహత్యకు ఆ మంత్రే కారణం

Ganapathi-Wifeబెంగళూరు : మంగళూరు డిఎస్‌పి గణపతి ఆత్మహత్యకు కర్ణాటక మంత్రి జార్జ్ కారణమని ఆయన భార్య పావని ఆరోపించారు. మంత్రి జార్జ్‌పై కేసు నమోదు చేయాలని ఆమె సిఐడికి లేఖ రాశారు. కాగా మంత్రి జార్జ్‌తో పాటు ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ నేతృత్వంలో బిజెపి నేతల బృందం శనివారం మడికేరిలోని రంగసముద్రంలో ఉన్న గణపతి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యలను కలిశారు. ఈ సందర్భంగా గణపతి ఆత్మహత్యకు సంబంధించి ఆరోపణలకు ఎదురుకుంటున్న మంత్రి జార్జ్ రాజీనామా చేసే వరకు అసెంబ్లీలో ధర్నా కొనసాగిస్తామని జగదీష్ శెట్టర్ తెలిపారు.

Comments

comments