Search
Saturday 21 July 2018
  • :
  • :

సిఎం కెసిఆర్ ఆడపడుచుల ఆపద్బంధువు: రాజయ్య

Thati-Konda-Seethaiah

మన తెలంగాణ/జఫర్‌గడ్: పేదింటి ఆడపడుచులకు అండగా నిలుస్తు కుటుంబంలోని పెద్దన్నగా సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్నరని మాజీ డిఫ్యూటి సిఎం, స్టేషన్ ఘన్పూర్  ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య పేర్కోన్నారు. మంగళవారం మండలంలోని రఘునాధపల్లి గ్రామములో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామశాఖ అద్యక్షుడు ఖమ్మం కృష్ణమూర్తి అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పేద పిల్లాల చదువులకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 570 గురుకుల పాఠశాలలు స్థాపించడం జరిగిందన్నారు. పేదింటి తల్లిదండ్రులు తమ పిల్లలకు పేండ్లిలు చేయాలంటే భయపడేవారని, ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి పేదింటి ఆడపడుచులకు మేనమామగా కళ్యాణిలక్ష్మి, షాదిముబారఖ్ పథకాల ద్వారా వివాహాల ఖర్చుకై రుపాయులు లక్ష పదహారు రుపాయులు అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వడ్డేర్ల సంక్షేమానికి పేద్దపీట వేస్తున్నరన్నారు.
కాంగ్రెస్ నుండి టిఅర్‌ఎస్‌లో చేరిక :-
మండలంలోని రఘునాధపల్లి గ్రామానికి చెందిన 500 మంది కాంగ్రెస్ నాయకులు టిఅర్‌ఎస్ పార్టీలో చేరగా వారిని స్టేషన్ ఘన్పూర్  ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య పార్టీ కండువాను కప్పి టిఅర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వనించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఅర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన పేర్కోన్నారు. అనంతరం మండలంలోని రఘునాధపల్లి గ్రామానికి చేందిన బొమ్మినేని పేద్దిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుండి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నరన్నారు. ఆయన కృషి గుర్తించి జఫర్‌గడ్ మండల ఉద్యమకారుల అద్యక్షుడు బొమ్మినేని పేద్దిరెడ్డి నియమిస్తున్నాట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుజ్జరి స్వరూపరాజు, మండల అద్యక్షుడు కొడారి కనకయ్య, రైతుమండల సమన్వయ సమీతి కన్వీనర్ కడారి శంకర్, నియోజకవర్గ నాయకులు ఎడ్ల వెంకటస్వామి, స్వామినాయక్, నాయకులు బొమ్మినేని సురెందర్ రెడ్డి, ఉప్పునూతుల ఎల్లమ్మ తదిరులు పాల్గొన్నారు.

Comments

comments