Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

అదే నా గ్లామర్ రహస్యం

alia

తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో కుర్రాళ్ల మతులు పోగొట్టిన యంగ్ హీరోయిన్ అలియాభట్. ఈ సినిమాలో బికినీలో దర్శనమిచ్చి హాట్‌హాట్‌గా మెరిసింది. ఆతర్వాత హైవే, 2 స్టేట్స్, హంప్టీ శర్మాకి దుల్హనియా, షాన్‌దార్, ఉడ్తా పంజాబ్, ఏ దిల్ హై ముష్కిల్, బద్రినాథ్ కీ దుల్హనియా వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది ఈ హాట్ బ్యూటీ. నటన అంటే తనకు ప్రాణమంటున్న అలియా భట్ మాట్లాడుతూ “నేను బాగా నటిస్తానని చాలామంది మెచ్చుకుంటుంటారు. అయితే నాకు ఏడవడం సరిగ్గా రాదు. నా ఏడుపు నాకే ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక నేను చాలా క్యూట్‌గా, యాక్టివ్‌గా ఉంటానని అందరూ అంటుంటారు. కానీ నాకు బద్దకం ఎంత ఎక్కువో వాళ్లకు తెలియదు పాపం. నిద్రపోవడానికి నేనిచ్చే ప్రాధాన్యత మరొకరెవ్వరూ ఇవ్వరేమో. సినిమా షూటింగ్ లేనప్పుడు 15 గంటలు ఏకధాటిగా నిద్రపోతుంటాను. తినడం, పడుకోవడమే పనిగా పెట్టుకుంటాను. గ్లామర్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. గ్లామర్ పెరగడానికి నిద్ర కూడా చాలా అవసరం. బహుషా నా గ్లామర్ రహస్యం అదే అయి ఉండొచ్చు. నాకు విమాన ప్రయాణాలంటే చాలా ఇష్టం. గాలిలో తేలేటప్పుడు మనసు కూడా ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. అదో గొప్ప అనుభూతి”అని పేర్కొంది.

Comments

comments