Home నిర్మల్ ఆదమరిస్తే అంతే సంగతి..!

ఆదమరిస్తే అంతే సంగతి..!

ROAD

మనతెలంగాణ/కుబీర్ : ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు ఆర్‌అండ్‌బి అధికారులే నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అధికారులు ఆ దిశగా పని చేయడం లేదని పలువురు అంటున్నారు. మండలంలోని హల్దా, చాత గ్రామాలను కలిపే రోడ్డు వర్షానికి కొట్టుకుపోయి బీటి రోడ్డు వరకు పెద్ద గుంతలు ఏర్పడ్డాయి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు ఆదమరిస్తే అంతే సంగతి అన్నట్లుగా వుంది. ప్రమాదం జరిగితేగాని స్పందించరా అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలుగా ఏర్పడ్డ రోడ్డును మరమత్తులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.