Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

తీరనున్న పల్లె కష్టాలు

Villages

* పంచాయతీలకు 14వ ఆర్ధిక సంఘ నిధుల వెల్లువ
* సమస్యల పరిష్కారానికి సదవకాశం

హుజూర్‌నగర్ టౌన్: పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. పన్నులు వసూలు కాక నిధుల లేమితో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులను వెల్లువలా విడుదల చేసింది. 14వ ఆర్ధిక సంఘ నిధుల నుంచి సూర్యాపేట జిల్లాలోని పంచాయతీలకు రూ. 15.88 కోట్లు విడుదల అయ్యాయి. ప్రోత్సాహక నిధుల నుంచి మరో రూ. 1.35 కోట్లు మంజూరు చేశారు. ఆదాయం అంతంత మాత్రం గా ఉన్న చిన్న పంచాయతీలకు 14వ ఆర్ధిక సం ఘం నిధుల విడుదలతో ఉపశమనం లభించి నట్లయింది. నిధులు లేక గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ నిధులు ఎంతో ఉపకరించనున్నాయి. పంచాయతీ ఎన్నికలల్లో ఎంతో ప్రతి ష్టాత్మకంగా తీసుకొని గెలిచిన సర్పంచులు నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రజల ముందు తలెత్తుకోలేక సతమతమవుతున్న తరుణంలో ఈ నిధులు కొంత మేర ఉపకరించనున్నాయి. ఇప్పటికే బీఆర్‌జీఎఫ్ నిధులను కేంద్రం రద్దు చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ గ్రాంట్లు రాకపోవడంతో నిధుల కొరతతో గ్రామ పాలన కుంటుపడింది.

పారిశుద్ధ్దం పడకేసింది. చాలా గ్రామాల్లో నీటి పథకాలు మరమ్మతులు లేక నిరుప యోగంగా ఉన్నాయి. వీధి దీపాలు వెలగక గ్రామా ల్లో అంధకారం నెలకొంది. 2016-17 ఆర్ధిక సంవత్సరానికి గాను గతేడాది చివరి నెలలో మొదటి విడతగా రూ. 15.88 కోట్లు సూర్యాపేట జిల్లాకు మంజూరు అయ్యాయి. అదే రీతిలో రెండో విడతగా ఈ నెలలో రెండో విడతగా రూ. 15.88 కోట్లును ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసింది. 2015-16 సంవత్సరానికి సంబంధించి 69 గ్రామ పంచాయతీలకు రూ. 1.97 లక్షలు చొప్పున రూ. 1.35 కోట్లు ప్రోత్సాహక నిధులు మంజూరు చేశారు. జిల్లాలో మొత్తం 323 గ్రామ పంచాయతీలు ఉండగా 241 పంచాయతీలు గత ఏడాది కంటే పన్నుల వసూళ్లలో మెరుగైన ఫలి తాలు సాధించినందుకు ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 82 వేల చొప్పున రూ. 2.03 కోట్లు మంజూరు అయ్యాయి. దీంతో పంచా యతీల్లో చిన్న చిన్న సమస్యల పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ఈ నిధుల ఖర్చును ప్రభుత్వం ఎలా చేయాలో సూచించింది. పంచాయతీలు ఆమోదం పొందిన పనులకే వీటిని కేటాయిం చాలని ఆదేశాలు జారీ చేసింది.

ఖర్చు ఇలా: గ్రామాల్లో పారిశుద్ధ పనులతో పాటు మురికి కాలువల నిర్మాణాలు చేయాలి. వేసవి సమీపిస్తుండటంతో తాగునీటి ఎద్దడి లేకుండా సౌకర్యాలు కల్పించాలి. వీటితోపాటు పైపులైన్ల మరమ్మతు, వీధి దీపాలు, చేతి పంపులు, విద్యుత్తు మోటార్లు తదితర వాటి నిర్వహణ, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, అంతర్గత రహదారుల మరమ్మతులు చేసుకోవచ్చు. సం తలు, దుకాణ సముదాయాల ఏర్పాట్లకు విని యోగించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.

నీటి ఎద్దడిపై దృష్టి: ఇప్పటికే మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గ్రామాల్లో మంచినీటి కష్టాలు ప్రారంభం అవుతు న్నాయి. ఈ తరుణంలో ప్రజలకు మంచినీటిని అందించాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంది. ఈ నిధులల్లో ఎక్కువగా మంచినీటి సమస్యకే వెచ్చించే అవకాశం ఉంది.

Comments

comments