Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

డబ్బులు లేకపోయిన గూగుల్ ద్వారా చెల్లింపులు…!

google-hands-free-payments-డబ్బులు లేకపోయిన గూగుల్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చుచ అదేలాగంటే.. గూగుల్ సంస్థ బుధవారం ‘హ్యాండ్స్ ఫ్రీ పేమెంట్’ యాప్‌ను విడుదల చేసింది. అయితే ఈ యాప్ మీకు ఏలా ఉపయోగపడుతుందంటే మీరొక స్టోర్‌లో ఏదైన వస్తువును కొనుగోలు చేశారు. జేబులో డబ్బులు లేవు. క్రెడిట్, డెబిట్ కార్డులు వాడటం ఇష్టం లేదు. ఇలాంటి సందర్భాలను గమనించి గూగుల్ సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతం అమరికాలోని శాన్‌ఫ్రానిస్కోలో ఈ యాప్‌ను పరీక్షిస్తోంది.

ఇలా పనిచేస్తుంది : బ్లూటూత్, వైఫై, జిపిఎస్ ద్వారా మీకు దగ్గర్లోని ‘హ్యాండ్స్ ఫ్రీ పేమెంట్ యాప్‌తో అనుసంధానమైన స్టోర్స్‌ను మీ యాప్ చూపుతుంది. అక్కడికి వెళ్లి కొనుగోలు చేసిన తర్వాత గూగుల్ ద్వారా చెల్లిస్తామని చెప్తే చాలు.. వెంటనే అక్కడ కంప్యూటర్ సిస్టమ్‌కు అనుసంధానమైన కెమెరాతో మీ ఫోటో తీసి హ్యాండ్స్ తీసి హ్యాండ్స్ ఫ్రీ ప్రొఫైల్ పిక్‌తో ఐడెంటిటీ సరిపోయిందో లేదో చూస్తారు. డబ్బులు స్టోర్ ఖాతాలోకి చేరగానే మీకు సందేశం వస్తుంది ఐడెంటిటీ కోసం తీసుకున్న ఫోటో వెంటనే డిలీట్ అవడంతో భద్రతకు ఢోకా ఉండదు. ఈ ప్రక్రియలో మీరు అస్సలు ఫోన్ ముట్టుకోనవసరమే లేదు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని మెక్ డొనాల్డ్, పాపా జాన్స్ తదితర స్టోర్స్‌లో ఈ పైలట్ యాప్‌ను పరీక్షిస్తున్నారు. హ్యాండ్స్‌ఫ్రీ ద్వారా చేసే తొలి కొనుగోలుపై 5 డాలర్ల డిస్కౌంట్ కూడా ఇస్తుండటం విశేషం. యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మాత్రం కాస్త సమయం పడుతుందని సంస్థ ప్రతనిధి తెలిపారు.

Comments

comments