Home నాగర్ కర్నూల్ సబ్ జైలు స్థలంలో నిరాణాలు సరికావు: జైళ్లశాఖ డిఐజి

సబ్ జైలు స్థలంలో నిరాణాలు సరికావు: జైళ్లశాఖ డిఐజి

police

– రెవెన్యూ నిబంధనాలు పాటించాలి
– నగర పంచాయతీ కార్యాలయ నిర్మాణంపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు
– తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ డిఐజి సైదయ్య

మన తెలంగాణ/కొల్లాపూర్: పురాతనమైన సబ్ జైల్‌లో నగర పంచాయతీ కార్యా లయం చేపడుతున్నారని తెలంగాణ జైల్‌శాఖ డిఐజి సైదయ్య అన్నారు. ఈ నిర్మా ణంపై ఉన్నత అధికారులకు పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.సోమవారం పట్టణంలోని జమ్మిచేట్టు దగ్గర నిర్మిస్తున్న నగర పంచాయతీ నిర్మాణం పనులను మహబూబ్‌నగర్ సబ్‌జైల్ సుపర్‌డెంట్ శివకుమార్‌గౌడ్, నాగర్‌కర్నూల్ సబ్ జైల్ సూపరిండెంట్ రమేష్ కొల్లాపూర్ సిఐ శ్రీరామ్ సైదాబాబుతో కలిసి ఆయన అక్ర మ కట్టడాలను పరిశీలించారు. సబ్ జైల్‌కు కేటాయించిన స్థలంలో నగర పంచా యతీ పనులు చేపట్టకుండా గేట్‌కు తాళం వేశారు. ఈసందర్భంగా నిర్మాణం జరు గుతున్న స్థలంను సబ్‌జైల్ అధికారులు తమ అధినంలోకి తీసుకున్నారు. ఈ సంద ర్భంగా సబ్ జైల్ డిఐజి సైదయ్య మాట్లాడుతూ ఇక్కడి ప్రాంత ఖైదిలు 20మంది మహబుబ్‌నగర్‌లో ఉన్నారని గుర్తు చేశారు. సిబ్బంది కొరత కారణంగా ఇక్కడ సబ్‌జైల్ నిర్మించలేక పోయామని ఆయన అన్నారు. ఇటివల సిబ్బంది కొరత తీరిం దని కొత్త నియామకాలు జరిగాయని ఆయన తెలిపారు.ఇక్కడి ఖైదిలను మహబు బ్‌నగర్ నుండి ఇక్కడి తీసుకరావడం ఇబ్బందిగా మారిందని ఇక్కడ సబ్‌జైల్ ఉంటే కొరత తీరుతుందన్నారు.అధికారులు రెవిన్యూ నిబంధనాలు పాటించాలని ఆయ న అన్నారు.అనంతరం రెవిన్యూ సబ్‌జైల్‌కు సంబందించిన విషయాన్ని చర్చించా రు. స్థలం బదలాయింపు జరగకుండనే నిబందనాలు పాటించకుండా నగర పం చాయతీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని జైల్‌శాఖ డిజిపి నగర కమీషనర్ రామ లింగంను ప్రశ్నించారు. కార్యక్రమంలో జైల్‌శాఖ సిబ్బంది రామకృష్ణ, విఆర్‌వో లు చెన్నయ్య, మనోహర్, తదితరులు ఉన్నారు.