Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి ఎగొట్టిన దర్శకుడి అరెస్ట్..!

The Accidental Prime Minister director Vijay Ratnakar Gutte held for Rs 34 Cr GST fraud

ముంబయి: భారత మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ పేరిట ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీని విజ‌య్ ర‌త్నాక‌ర్ గుట్టె దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, చిత్ర ద‌ర్శ‌కుడు ర‌త్నాక‌ర్ గుట్టె  ఏకంగా రూ. 34కోట్ల జిఎస్‌టి ఎగొట్టిన కార‌ణంగా జిఎస్‌టి ఇంటెలిజెన్స్ వింగ్ అతన్ని అదుపులోకి తీసుకుంది. డూప్లికేట్ ఇన్‌వాయిస్‌ ద్వారా రూ.34 కోట్ల జిఎస్‌టి క్రెడిట్‌ను విజయ్‌కు చెందిన కంపెనీ విఆర్‌జి డిజిటల్‌ క్లయిమ్‌ చేసుకున్నట్లు తెలిసింది. విజయ్‌ను జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌ వింగ్‌ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది.

Comments

comments