Home నాగర్ కర్నూల్ ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం : చాడ

ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం : చాడ

Chada-venkatreddy

మన తెలంగాణ/కొల్లాపూర్ : తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్యెల్యే, గ్రామ సర్పంచ్‌లు, టిఆర్‌ఎస్ నాయకుల అవినీతి బాగోగం బయట పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధికై సిపిఐ పోరుబాట కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌ఎండి పయాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్షం గా సిపిఐ పోరుయాత్ర కొనసాగుతుందన్నారు.  ఎన్నికల ముందు ప్రధాని మోడీ నల్లధనం డబ్బులు తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని హామి ఇచ్చారని, పెద్ద నోట్లు రద్దు చేసి 12మంది ప్రాణాలు బలితీసుకున్నారని జిఎస్‌టితో సామాన్య ప్రజలకు ఇబ్బందు లు కల్గిస్తున్నారని విమర్శించారు.  తెలంగాణ ప్రభుత్వం మాటలు కోటలు దాడుతున్నాయని పనులు కడప దాటడంలేదని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సభ్‌ప్లాన్ నిధులు 52శాతం నిధులు దారి మళ్ళీంచారిని ఆయన అన్నారు.   కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ బీరం హర్షవర్ధన్ రెడ్డి పోరుబాట సభకు సంఘీభావం తెలిపారు. అనంతరం గద్దర్ ఆటపాటలతో ప్రజలను, పార్టీ కార్యకర్తలను అలరించి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని నాటకం ద్వారా తెలియజేశారు.  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, పశ్య పద్మ, డి.హెచ్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బరిగెల సాయిలు, మహిళా సమాఖ్య రా్రష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన,తదితరులు పాల్గొన్నారు.