Search
Tuesday 20 November 2018
  • :
  • :

జైపూర్ ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్నభోజనం ప్రారంభం

manchi

జైపూర్: తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు నిరుపేదలు ఉంటారని, వారిని దృష్టిలో పెట్టుకొని తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ కళాశాలల్లో ప్రతి రోజు 1500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకువచ్చామని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి రాజ్‌కుమార్ నాయక్, స్థానిక ఎంపిటిసి మంథెన లక్ష్మణ్, సర్పంచ్ భీమిని రాజయ్య, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రిక్కుల మధూకర్ రెడ్డి, నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ అరవిందరావు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments