Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సాగు నీరందించడమే ధ్యేయం

The aim is to provide irrigation water

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/వనపర్తి రూరల్ : వనపర్తి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే నా ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామంలో ఏర్పా టు చేసిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ దత్తాయపల్లి గ్రామం నుండి చందాపూర్, చందాపూర్ తాండ, సవాయి గూడెం గ్రామం వరకు డిస్ట్రిబ్యూటర్ కాల్వ ఎంజె-4 కాల్వ పనులను కేవలం 20 రోజుల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి మండల పరిధిలో ఆదివారం దత్తాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావే శంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్ కాల్వ ఎంజె-4 ద్వారా దత్తాయపల్లి ,చందాపూర్,చందాపూర్‌తాండ,సవాయిగూడెం గ్రామాలకు దాదాపు 4450 ఎకరా లకు సాగునీరు కేవలం 20 రోజుల్లో నేసరఫరా చేస్తామన్నారు. ఈ కాల్వ ద్వారా చెర్వులను నింపడం జరుగుతుందన్నారు. అనంతరం డిస్ట్రిబ్యూటర్ కాల్వ పనులను కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ డి8 ఎంజె-4 కాల్వ పనులు గత 30 రోజులుగా జరుగుతున్నాయ న్నారు. కేవలం 20రోజుల్లోనే కాల్వ పనులను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాల్వ పనులు ఇప్ప టికే 50 శాతం పూర్తి కావడం జరిగిందన్నారు. 6 భారీ యంత్రాలతో ఈ కాల్వ పనులను వేగవంతం చేయ డం జరుగుతుందన్నారు. 3 షిప్టుల ప్రకారం ఇంజనీర్లు, బాధ్య త తీసుకొని ఎంజె 4 పనులను వేగ వంతం చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్ ఎంజె4 ద్వారా వనపర్తి మండలంతో పాటు పాన్‌గల్ మండలంలోని గ్రామాలకు కూడా సాగునీరు త్వరలో అందజేస్తామన్నారు. కిష్టాపూర్, గోప్లాపూర్, అన్నారం, వనపర్తి మండల పరిధిలో అంజనగిరి,దత్తాయపల్లి, దత్తాయపల్లి తండా, లుంబియాతాండ, చందాపూర్ చందా పూర్ తండా, సవాయిగూడెం గ్రామాలకు కేవలం 20 రోజుల్లో రైతుల పొలాలకు సాగునీరు అందజేస్తా మన్నా రు. కార్యక్రమంలో ఎంపిపి శంకర్‌నాయక్, గొర్రెల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు గట్టుయాదవ్, మం డల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరసింహ్మ, టిఆర్‌ఎస్ నాయకులు , గ్రామస్తులు రైతు సమన్వయ సమితి గ్రామాధ్యక్షులు రవీందర్ నాయుడు, టిఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments