Home వనపర్తి సాగు నీరందించడమే ధ్యేయం

సాగు నీరందించడమే ధ్యేయం

the-aim-is-to-provide-irrigation-water

వనపర్తి జిల్లాలో త్వరలో ఏడు రిజర్వాయర్‌ల నిర్మాణాలను పూర్తి చేస్తాం
18 కి.మీల పొడవు గల కాల్వ నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేస్తాం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/వనపర్తి రూరల్ : వనపర్తి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందించడమే తన ధ్యేయమని, వనపర్తి జిల్లాలో త్వరలో ఏడు రిజర్వాయర్‌ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి, పాన్‌గల్ మండల పరిధిలోని అంజన గిరి, దత్తాయపల్లి, చందాపూర్, దావాజిపల్లి గ్రామాలకు, కిష్టాపూర్ గ్రామం నుండి 18 కి.మీల పొడవు గల సాగునీటి కోసం కాల్వ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం భూమి పూజ చేసి కాల్వ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి మండలంలోని 4 గ్రామాలకు సాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పొలాలకు పాన్‌గల్ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామం నుండి అంజనగిరి, దావాజిపల్లి, దత్తా యపల్లి, చందాపూర్ గ్రామాల శివారులో గల చెర్వులను నింపి బీడు భూములను సస్య శ్యామలం చేయా లనే ఉద్ధేశ్యంతో ఈ కాల్వ పనులను ప్రారంభించామన్నారు. ఈ పనులు పూర్తయ్యేందుకు దాదా పు 4 సంవత్స రాల కాలం పడుతుంది. రైతుల కష్టాల గురించి ఆలోచన చేసి 3 కి.మీల ఒక యంత్రం చొప్పున 10 యం త్రాలతో ఈ కాల్వ నిర్మాణం పనులను 45 రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంట్రా క్టర్లకు గత ప్రభుత్వాల్లో ఆంధ్రావారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.తెలంగాణ రాష్ట్రంలో తెలం గాణ కాంట్రాక్టర్లు మన జిల్లా లో గల నైపుణ్యం కల్గిన కాంట్రాక్టర్లను సాయిచరణ్, శ్రీనివాస్‌రెడ్డిలకు పను లను అప్పగిం చామన్నారు. కిష్టాపూర్ గ్రామం నుండి మొదలయ్యే కాల్వను రెండు రోజుల్లో పంచాయతీ రాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ కాల్వ రెండు మండలాలు వనపర్తి,పాన్‌గల్ మండలాల రైతుల పొలాలకు సాగునీరు అందించేందుకు ఈ కాల్వ నిర్మా ణాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఈ రెండు మండలాలు పాన్‌గల్, వనపర్తి మండలాల్లోని రైతుల పొలా ల ను సస్యశ్యామలం చేసేందుకు ఈ కాల్వ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని రైతులకు హామీ ఇచ్చా రు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నీళ్లతో ఏదుల రిజర్వాయర్ లో వచ్చే దసరా నాటికి రిజర్వాయ ర్‌ను నింపుతామన్నారు. ఒక్కసారి రిజర్వాయర్ నిండుతే ఈ రెండు మండలాలకు రైతుల పొలాలకు 4 సంవత్స రాల పాటు సాగునీరు అందించవచ్చన్నారు. వనపర్తి జిల్లాలో ఏడు రిజార్వాయర్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రిజర్వాయర్ల ద్వారా గ్రామాల్లోని చెర్వులను నింపి రైతుల పొలాలను సస్యశ్యామలం చేయ డమే నా ధ్యేయమన్నారు. ఎంజె -3 ,2200 ఎకరాలకు నీరు ఇస్తే తెలంగాణలో అదనంగా 2750 ఎకరా లకు సాగునీరు అందింస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి శంకర్‌నాయక్,మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎత్తం రవికుమార్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, గొర్రెల సహకార సంఘం జిల్లా అధ్య క్షులు కురుమూర్తి యాదవ్, సర్పంచ్‌లు గోపాల్,విష్ణు, వెంకటయ్య, టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు మాణి క్యం, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షులు నరసింహ్మ,కౌన్సిలర్ వాకిటి శ్రీధర్,టిఆర్‌ఎస్ పట్టణా ధ్యక్షులు గట్టుయాదవ్, యోగానందరెడ్డి, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల శ్యాం, చిట్యాల రాము, కురుమూర్తి, ఉపసర్పంచ్ కృష్ణయ్య గౌడ్ ,ఎంపిటిసిలు , రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.