Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

గ్రామాల అభివృద్ధ్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

The aim of the government is to develop the villages

గ్రామాల అభివృద్ధ్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు

మన తెలంగాణ/లక్షెట్టిపేట:  రాష్ట్రంలో ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్షం అని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు. మండలంలోని లక్ష్మిపూర్, జెండవెంకటాపూర్ గ్రామాల్లో సోమవారం నూతనంగా ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా వేసిన సిసి రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలోని ఏగ్రామం కూడా అభివృద్దికి నోచుకోలేదని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రతీ మారుమూల గ్రామానికి సైతం రోడ్డు వేయడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో ఇప్పటికే 85శాతం రోడ్లు పూర్తి అయ్యాయన్నారు. రానున్న రోజుల్లో నూటికి నూరు శాతం రోడ్లు వేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వాన్ని మించింది లేదని ప్రతీ ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రశేకర్‌రావు గారికి ఋణపడి ఉండాలన్నారు. అనంతరం నాయకులతో కలిసి టెంకాయ కొట్టి రెబ్బన్ కట్‌చేసి నూతన సిసిరోడ్డులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో డీసిఎమ్మెస్ చేర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపిపి పాదం శ్రీనివాస్, పార్టీ మండల అద్యక్షుడు పోడేటి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్‌లు గంగుల దీప, ముంజం సరితరవీందర్, ఎంపిటిసి గడుసు స్వప్నరమేష్, ఎల్తపు సునీత సుదాకర్, నాయకులు వెంకట్రావు, లచ్చన్న, రాంమూర్తి, గోల్కొండ సత్తయ్య, శ్రీకాంత్, కోన రవీందర్, రాజమల్లు, తిరుపతి, సుదాకర్, చంద్రశేకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments