Home నాగర్ కర్నూల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అదుర్స్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అదుర్స్

The All people of the community is the government's target

సకలజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్షం
దేశంలో ధనిక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు
      – ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి లకా్ష్మరెడ్డి

బంగారు తెలంగాణ దిశగా అడుగులు
సాగునీరు, సంక్షేమ రంగాలకే పెద్దపీట
     -రాష్ట్ర అవతరణ దినోత్సవంలో మంత్రి జూపలి కృష్ణారావు

మన తెలంగాణ/నాగర్ కర్నూల్: సకలజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్షమని రాష్ట వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డా.చర్లకోల లకా్ష్మరెడ్డి అన్నా రు. నాలుగవ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్టం లో అమలు అవుతున్న పతాకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని అన్నారు.అనేక రంగాలలో జాతీయస్థాయిలో తెలంగాణకు అవార్డులు రావటం సమర్థవంతమైన పరిపాలనకు గీటురాళ్ళని అన్నారు. జిల్లా ప్రజలకు అయన తెలంగాణ అవిర్భవ శుభాకాంక్షలు తెలిపారు. అమర వీరులకు నివాళి అర్పించారు.మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన అడుగులు వేయగలుగుతున్నామన్నారు.రైతుబంధు పతకంతో వ్యవసాయ పెట్టుబడి దరల పెరుగుదల కుటుంబ ఖర్చుల పెరుగుదల,కరువు మొదలగు కారణాల వల్ల రైతుల ఆదాయం గణనీయంగా పడిపోవటంతో వారికి మంచి ఆదాయం కల్పించాలని ,అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో వ్యవసాయ అవసరాలకు ప్రభుత్వం రైతుబంధు పతకం తెచ్చిందన్నారు.అదేవిధంగా భూమి రికార్డుల శుద్దికరణ కార్యక్రమం ద్వారా వాస్తవ పరిస్థితును ప్రతిబింబించడం లేదని ఖచ్చితమైన రికార్డులు తయారు చేసి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా చేయటం జరిగిందన్నారు.భూమి రికార్డుల నిర్వహణలో పారదర్శకత,జవాబుదారితనమును సాధించి రైతులకు గ్రామ రికార్డులను అందుబాటులో ఉంచామన్నారు.రైతులకు పాసు పుస్తకాలను ముద్రించి పంపిణి చేయటం జరుగుతోందన్నారు.పాలమూరు జిల్లాకు కృష్ణమ్మ నీటిని అందించేదుకు రూ.35200 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించామన్నారు.ఇప్పటి వరకు 4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి మూడు ప్యాకేజిలలోరూ.474.20 కోట్ల రూపాయల పని జరిగిందన్నారు.రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా రబీ సిజన్‌లో 40వేల ఎకరాలకు నీరివ్వటంతో పాటు చిన్న నీటిపారుదల చేరువులు నింపడం జరిగిందన్నారు.భూత్పుర్ బ్యాలన్సింగ్ రిజర్వాయర్ కింద ఉన్న రెండు ప్రధాన కాల్వల ద్వారా గత ఖరీఫ్,రబిలో 37000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు.మిషన్ కాకతీయ కింద జిల్లాలో 2.463 చేరువులను పునరుద్ధరణ చేయుటకు నిర్ణయించటం జరిగిందన్నారు.ఉద్యానవనంలో పండ్ల తోటల ఉత్పత్తి,ఉత్పాదకత,నాణ్యత పెంచుటకు నీటి గుంటలు,సోలార్ కోల్ట్ రూం,శీతల గిడ్డంగులకు రూ.2.90 కోట్ల వ్యయం చేయటమైందన్నారు.పవుసంవర్ధక శాఖ ద్వారా గొర్రెల అభివృద్ధి పథకంతో సభ్యులకు అందే విధంగా 454 సంఘాలలో అర్హులైన 54.075 మందికి కాపరులను విభజించి 27.876 మందికి గొర్రెల యూనిట్లను పంపిణి చేయటం జరిగిందన్నారు. పాడిపరిశ్రమాభివృద్ధికి జిల్లాలో ఒక పాల శీతలీకరణ కేంద్రంతో పాటు 5 మినీ పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.మార్కేటింగ్‌లో జిల్లాలోని 7 వ్యవసాయ మార్కేట్ కమీటిలు,7 చేక్ పోస్టులు రైతు బజార్లు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.రైతులకు పంట భీమా,పంటకు భద్రత బీమా కల్పించబడుతుందన్నారు.జిల్లాలో నాబార్డు సౌజన్యంతో కొత్తగా 13 మండల గోదాములు60.000 మెట్రిక్‌టన్నుల సామర్థంతో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు వి.శ్రీనివాస్‌గౌడ్,జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రొస్,ఎస్‌పి బి.అనురాధ,వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రజలను చైతన్యం చేసి సేవా కార్యక్రమాలను అందిచిన వారికి ప్రశంస పత్రాలు.రూ.40వేల చెక్,జ్ఞాపికను అందజేశారు.
బంగారు తెలంగాణ దిశగా అడుగులు

సాగునీరు, సంక్షేమ రంగాలకే పెద్దపీట
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో (మంత్రి జూపలి కృష్ణారావు)
తెలంగాణ అవతరించి నాలుగేళ్లు పూర్తయ్యిందని మనం కలలు గన్న బంగారు తెలంగాణ నిర్మానం కోసం భలమైన అడుగులు వేయగలిగామని రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పెరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉండే విదంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారద్యంలో ప్రవేశ పెట్టిన ప్రణాలికలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఉన్న సమస్యలను అదిగమించి అభివృద్ది రాష్ట్రంగా తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ఇది దశాబ్దాల కాలంగా చేసిన పోరాట ఫలితమేనని నేడు తెలంగాణ రాష్ట్రం సాదిస్తున్న విజయాలను తెలంగాణ బిడ్డలుగా గర్వపడాలన్నారు. అనతి కాలంలోనే రాష్ట్ర అనేక విజయాలను సాదించందని జూపల్లి అన్నారు. రాష్ట్ర సాదించిన ప్రగతి ఇక్కడ అమలవుతున్న పథకాలకు దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయన్నారు. 20శాతం ఆదాయాభివృద్ది రేటుతో ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గ్రామీణ వ్యవస్థ బాగుంటేనే వృత్తులను నమ్ముకుని జీవించే ప్రజలకు చేతి నిండా పని, కడుపునిండా అన్నం దొరుకుతుందన్నారు. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకు రావడం సామాజిక, ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం తీసుకు ్తన్న పథకాలతో తెలంగాణ రాష్ట్రం దూసుకెలుతుందన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, జిల్లాలలో 29 షెడ్యూలు కులాలకు ఫ్రీ మెట్రిక్, కళాశాలల వసతి గృహాలలోని 3351 మంది విద్యార్థినీ, విద్యార్థులకు బోజన వసతి ఫీజులు, మేంటెనెన్స్ చార్జీలు అందించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4 పెండింగ్ ప్సాజెక్టులను పూర్తి చేయడం జరిగిందని 40 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి ఈప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 12.5 లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల ద్వారా సాగునీరందించడం జరుగుతుందని కరువు జిల్లాగా పేరున్న పాలమూరుకు ఈపథకం పూర్తయితే కోన సీమగా అభివృద్ది చెందుతుందన్నారు. . ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర శ్రీదర్, ఎస్‌పీ సన్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వివిద రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందించారు. ఉత్తమ రైతుగా లావణ్య రమనారెడ్డి, ఉత్తమ సోషల్ వర్కర్‌గా ప్యారసాని రమాకాంత్, ఉత్తమ క్రీడాకారినిగా దొంతు భాగ్యలక్ష్మి, ఉత్తమ సాహితి వేత్తగా వనపట్ల సుబ్బయ్య, ఉత్తమ కళాకారుడిగా డప్పు నర్సింహ్మ, ఉత్తమ అర్చక పసండితుడిగా సురేశ్ శర్మ, ఉత్తమ షేఖ్ హిమామ్‌గా మహ్మద్ అబ్దుల్ హక్, ఉత్తమఎలక్రానిక్ మీడియా జర్నలిస్టులుగా శేఖరాచారి, చంద్రశేఖర్‌రావు, ఉత్తమ ప్రింట్ మీడియా జర్నలిస్తుగా సురేశ్‌రావు, ఉత్తమ ఎన్‌జీఓగా చెంచులోకం సభ్యులకు అవార్డులను మంత్రి కలెక్టర్‌ల చేతుల మీదుగా అందించారు. అదేవిదంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులను షాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వివిద పాఠశాలల వారు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోలీసు జాగిలాలు చేసిన ప్రదర్శన ఆహుతులను అలరించింది.