Search
Wednesday 14 November 2018
  • :
  • :

చరిత్రకు చెదలు..

The ancient canister was destroyed
పురాతన కోనేరు ధ్వంసం
పునరుద్దరణ పట్ల నిర్లక్షం
బిజినేపల్లి : దాదాపు మూడు దశాబ్దాల చరిత్ర కల్గిన దేవాలయం ప్రాంగణంలో ఏకాలమైనా నీరు ఉండి ఆలయ పూజలకు వినియోగించే కోనేరును మిషన్ భగీరథ కాల్వ తవ్వకాల్లో ధ్వంసం చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆ కోనేరును పునరుద్దరించాలంటూ భక్తులు ,గ్రామస్తులు చేస్తున్న విజ్ఞప్తులు అరణ్య రోదనగా మారుతున్నాయి. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బిజినేపల్లి మం డల పరిధిలోని వట్టెం జడ్చర్ల రహదారిపై ఉన్న శ్రీలక్ష్మి నర్సింహ్మ స్వామి ఆలయం ముందు ఓ కోనేరు ఉంది. మూడు వందల సంవత్సరాల నాటి ఈ పురాతన ఆలయం నిర్మించినప్పుడే ఆలయ అవవసారలతోపాటు భక్తులకు సౌకర్యంగా ఉండేవిధంగా ఈ కోనేరును తవ్వించారు. వేసవి కాలంలో సైతం ఈ కోనేరులో స్వచ్చమైన నీరు నిల్వ ఉంటుంది. కాగా ఈ రహదారిపై కొనసాగుతున్న మిషన్ భగీరథ పైపు లైను తవ్వకాలలో కాంట్ట్రాక్టర్ నిర్లక్ష వ్యవహారానికి ఈ కోనేరు కొంత భాగం ధ్వంసం అయింది. ఈ విషయంలో గ్రామస్తులు అభ్యంతరం చెప్పి పనులను అడ్డుకున్నారు. కాల్వ తవ్వకం పనులు పూర్తికాగానే కోనేరును పునర్దురిస్తామని కాంట్రాక్టర్‌తోపాటు అక్కడున్న అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సరేనన్నారు. కాగా కాల్వ తవ్వకంతోపాటు పూడ్చే పనికూడా పూర్తయినా కోనేరు పునరుద్దరణ గురించి పట్టించుకోవడంలేదు.

ఈ విషయంలో అడిగేందుకు ప్రయత్నిస్తే కాంట్రాక్టర్‌గానీ ,అధికారులు గానీ స్పందించడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ప్రాంతంలో పనులు అయిపోయినందున తమకేంటి అన్న ధీమాతో కాంట్రాక్టర్ వున్నారని గ్రామస్తులు వెల్లడించారు. కాగా ఈ నెల 29న ఈ ఆలయంలోని శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి జయంతి సంర్బంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఉంటుందని ,స్వామి వారి ప్రత్యేక పూజలకు సంబందించిన కార్యక్రమాలకు ఈ కోనేరు నీరే వాడుతారని వారు తెలిపారు .వెంటనే కోనేరు పునర్దురణ చేయక పోతే మిషన్ భగీరత పనులు ఎక్కడ జరుగుతున్నా వాటిని అడ్డుకుంటామని , ఆందోళన కూడా చేపడతామని కూడా వారు హెచ్చరించారు.
విస్వాసాలకు విఘాతం
ఇక్కడి లక్ష్మి నర్సింహ్మ స్వామి ఆలయం ఎంతో పురాతనమైనదేగాక ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. ఇలాంటి ఆలయ మూల విరాఠుకు ఈ కోనేరు నీటితోనే పూజలు నిర్వహించడం ఆనవాయితాగా వస్తున్నది. దేవుడి పూజకు విఘాతం కల్గించడం అంత మంచిది కాదు. వెంటనే ఈ విషయంలో అందరు స్పందించాలి

చరిత్ర ఆనవాళ్లు ధ్వంసం
వందల ఏండ్ల చరిత్ర కల్గి ఉండటమేగాక భక్తి విశ్వాసాలకు సంబందించిన కోనేరు ధ్వంసం సరికాదు. కోనేరును వెంటనే సరిచేయక పోతే ఆందోళన చేపడతాం . దీనిపై స్థానిక అధికారులు , అధికార పార్టీనేతలు కూడా సరైన రీతిలో స్పందించక పోవడం శోచనీ

Comments

comments