Home కెరీర్ చాన్సలర్లు వస్తున్నారు

చాన్సలర్లు వస్తున్నారు

universitiesయూనివర్శిటీలకు చాన్సలర్‌ను నియమించే అధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. గవ ర్నర్ స్థానంలో ఒక్కో యూనివర్శిటీకి ఒక్కొక్కరు చాన్సలర్‌లుగా ఉండనున్నారు. ఈ మేరకు యూనివర్శిటీల చట్ట సవరణకు విద్యశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య శుక్రవారం ఆదే శాలు జారీ చేశారు. ఇకపై రాష్ట్రంలో యూనివర్శి టీలకు ప్రభుత్వం నియమించే వ్యక్తే చాన్సలర్ గా వ్యవహరించనున్నారు. ఒక్కో యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌తో పాటుగా చాన్సలర్ ఉంటారు. ఉమ్మ డి రాష్ట్రంలోని 1991 యూనివర్శిటీల చట్టానికి సవరణ తీసుకోస్తూ జిఒ 28ని జారీ చేశారు. సవరించిన చట్టం శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుందంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. యూనివర్శిటీల చట్టం సెక్షన్ 10లో రాష్ట్ర గవర్నర్ యూని వర్శిటీలకు చాన్సలర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. దానికి సవరణ చేస్తూ ఇకపై రాష్ట్ర ప్రభుత్వం నియమించే వ్యక్తి ఛాన్సలర్‌గా ఉంటారని సవరణ తీసుకోచ్చారు.

ఈ సవరణ రాష్ట్రంలోని యూనివర్శిటీలన్నంటికి వర్తిస్తుందంటూ జిఒలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు మూడు నాలుగు యూనివర్శిటీలకు మినహా మిగిలిన వాటికి గవర్నర్ ఒక్కరే చాన్సలర్‌గా వ్యవహరించే వారు. తాజాగా సవరించిన చట్టంతో ఒక్కో యూనివర్శిటీకి ఒక్కొక్కరు ఛాన్సలర్‌లు నియమితులుకానున్నారు. రాష్ట్రంలోని 14 యూ నివర్శిటీలకు సవరించిన చట్టం వర్తించనుంది. అయితే ఎవరిని చాన్స లర్‌గా నియమిస్తారు? అర్హులు ఎవరు అనే విషయాలను ఎక్కడా పేర్కొన లేదు. గుజరాత్ రాష్ట్ర తరహాలో చట్టాన్ని రూపోందించారు. ఇప్పటి వరకు ఒక్కొ యూనివర్శిటీకి ఒక్కో రకమైన చట్టాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకోచ్చి చాన్సలర్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్పులు చేశారు.
నియామకాలకు లైన్ క్లియర్
రాష్ట్రంలోని యూనివర్సిటిలన్నంటికి ఇన్నాళ్లు వైస్ ఛాన్సలర్లు లేరు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యకమవుతున్న తరుణంలో యూనివర్సి టీల చట్ట సవరణను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి ఆమోదింప చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే న్యాయ శాఖ అధ్యయనంతో చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం అవసరంలేదని అభిప్రాయానికి వచ్చా రు. దీంతో ఇక యూనివర్సిటిలకు ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ నియామక ప్రక్రియకు లైన్‌క్లియర్ అయింది. వైస్ ఛాన్సలర్ కు సెర్చ్ కమిటిని నియ మించాల్సి ఉంటుంది. యూజిసి ప్రతినిధి, యూనివర్సిటి ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ముగ్గురుతో కమిటీ వేసి పేర్లను మూడు పేర్లను ఖరారు చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. ఒకరిని ప్రభుత్వం విసిగా ఎంపిక చేస్తుంది.
విసిలు డమ్మిలేనా..?
యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా ఫుల్‌టైమర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఉప కులపతులు నామమాత్రం కానున్నారనే చర్చ మొద లైంది. విసికి ప్రత్యేక అధికారాలున్నా… ఆ నిర్ణయాలన్నింటికి ఛాన్సలర్ ఆమోద ముద్ర తప్పనిసరి. దీంతో ఇరువురి మధ్య ఆధిపత్య పోరు తీవ్రవయ్యే అవకాశాలున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. విసి లుగా నియమితులయ్యే వారి వ్యతిరేక వర్గానికి ఛాన్సలర్‌ను అండగా చేసుకుని వర్శిటీల పరిపాలన అస్తవ్యస్తంగా తయారయ్యే అవకాశం ఉందని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు.