Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పాకిస్థాన్‌లో ముగ్గురు భారతీయులు అరెస్ట్

ARREST-2

ఇస్లామాబాద్: కుల్‌భూషణ్ జాదవ్ వివాదం కొనసాగుతుండగా పాకిస్థాన్ మరో ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నామని పేర్కొంది. వీరు భారత్‌కు చెందిన రహస్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలి సిస్ వింగ్ (రా) తరుపున పనిచేస్తున్నారని పేర్కొంది. ముసుగులు ధరించిన ముగ్గురిని మీడియా ఎదుట ప్రవేశపెట్టినట్లు పాకిస్థాన్ పత్రిక డాన్ శనివారం పేర్కొంది. ఈ ముగ్గురు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తరోట్ గ్రామంలో నివసిస్తున్నారని తెలిపింది.

ప్రధాన నిందితు డు ఖలీల్ 2014 నవంబర్‌లో కశ్మీర్‌లో పర్యటించి ‘రా’ తో సంబ ంధాలు పెట్టుకున్నారని పూంచ్ సెక్టార్ డిఎస్‌పి ఇమ్రాన్ తెలిపారు. అబ్బాస్‌పూర్‌లో సెప్టెంబర్‌లో జరిగిన బాంబు పేలుడుతో వీరికి సంబం ధం ఉందని పేర్కొన్నారు. ఐఇడి పేలుడు పదార్థాలు అమర్చారని ఆయన తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఖలీల్‌కు రూ.5 లక్షలు ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ముగ్గురిపైన ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఎటిఎ), పేలుడు చట్టం కింద కేసులు నమోదు చేశామని ఇమ్రాన్ తెలిపారు.

Comments

comments