Home జగిత్యాల సిపిఎస్ రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలి

సిపిఎస్ రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలి

stu*ఎస్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైరం హరికిరణ్

మన తెలంగాణ / జగిత్యాల: రాష్ట్రం లో లక్షా ఇరవై వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్య తయారైన కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం విధానాన్ని రద్దు చేస్తూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించాలని ఎస్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైరం హరికిరణ్ ప్రభుత్వాన్ని కోరారు.
మంగళవారం కోనాపూర్‌లో జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘం మండల శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన కాంట్రీబ్యూటరీ పెన్ష న్ స్కీం ఉద్యోగులకు డెత్ గ్రాట్యూటీ, సాధారణ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, కమ్యూటేషన్ సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర మనోవేధనకు గురవుతున్నారన్నారు. ఇప్పటి వరకు సుమారు 300 మంది కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగులు మరణించారని, 1000 మంది పదవీ విరమణ చేశారని, వారికి కనీస పెన్షన్ అందక వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితి లో ఉన్నాయన్నారు.
ఇటీవలి మార్కెట్ పతనంతో ఒక్కో కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగి ఖాతా నుంచి వేల రూపాయలు నష్టపోయారన్నారు. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీంరద్దుచేసే అధికారం రాష్ట్ర పరిధిలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసినందున ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేలా తీర్మా నం చేయాలని కోరారు. లేని పక్షంలో కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం వ్యతిరేక సంఘాల ఐక్య వేదికగా పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చ శంకర్, జిల్లా కార్యదర్శి సలీమొద్దీన్, రాగిల్ల వెంకటేశ్, బండి శ్రీనివాస్, బోడ నంద్యానాయక్, గుర్రం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.