Home జగిత్యాల వైద్య సిబ్బంది కారణంగా శిశువు మృతి

వైద్య సిబ్బంది కారణంగా శిశువు మృతి

dead2

మెట్‌పల్లి: మెట్‌పల్లి ప్రభుత్వ ఆసపత్రిలో పని చేసే వైద్య సిబ్బంది నిర్లక్ష కారణంగా శిశువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామానికి చెం దిన గర్భణీ నవనీత(22) ప్రసవం కోసం శుక్రవారం మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అదేరోజు రాత్రి 2 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. అందుబాటులో డాక్టర్‌లు లేరు. దీంతో నర్సులు డాక్టర్‌ను పిలవకుండా నిర్లక్షంగా వ్యవహరించారు. ఉదయం ఐదు గంటలకు డాక్టర్ లేకుండానే నర్సులు ప్రసవం చేశారు. అ ప్పటికే శిశువు మృతి చెంది ఉన్నాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆగ్ర హం వ్యక్తం చేస్తూ డాక్టర్ లేకుండా మీరేలా కాన్పుచేస్తారని, ఆసుపత్రి సూపరిండెం ట్ డాక్టర్ అమరేశ్వర్‌ను నిలదీశారు. దీంతో పోలీసులకు సమాచారమివ్వడంతో శి శువు బంధువులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
శిశువు మృతికి కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీ య రహదారిపై ధర్నా చేశారు. ఇది ఇలా ఉండగా నవనీత సోదరుడు ఆకుల నవీన్ తహసీల్దార్ సుగుణకర్‌రెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును జి ల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.