Home జాతీయ వార్తలు ఫిరాయింపు ఎంఎల్‌ఎల అనర్హత కేసు రాజ్యాంగ ధర్మాసనానికి

ఫిరాయింపు ఎంఎల్‌ఎల అనర్హత కేసు రాజ్యాంగ ధర్మాసనానికి

మవలంకర్లు ఇప్పుడెక్కడ? 

  • స్పీకర్ల అప్రతిహత నిర్ణయాధికారంపై పునఃసమీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్య
  • స్పీకర్లే ఫిరాయింపులకు పాల్పడుతున్నప్పుడు వారి నుంచి నిష్పాక్షికత ఎలా ఆశిస్తామని ప్రశ్న
  • లోక్‌సభ స్పీకర్ పదవినే వదులుకున్న మవలంకర్ వంటి మహాత్ములు ఇప్పుడు లేరని ఆవేదన
  • రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సంపత్ కుమార్ పిటిషన్ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదన

supreme-courtన్యూఢిల్లీ : పార్టీ ఫిరాయించి అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సంపత్ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ సరికొత్త మలుపు తిరి గింది. అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌కు ఉన్న అధికారాలు, బాధ్యతలను నిర్ణయిం చేందుకు ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్ నారీమన్, జస్టిస్ ఆర్‌కె అగర్వాల్‌లతో ధర్మాసనం నిర్ణయించింది. అసెంబ్లీ వ్యవహారాల్లో తలదూర్చకుండా పార్టీ ఫిరాయింపులపై తుది నిర్ణయం స్పీకర్‌కే కట్టబెడుతూ గతంలో పలు కేసుల్లో ఇచ్చిన తీర్పును మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో పునఃసమీక్షించా ల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నైతిక విలు వలకు కట్టుబడి గతంలో లోకసభ స్పీకర్ పదవినే వదలుకున్న మవలంకర్ వంటి మాహాత్ములు ఇప్పుడెక్కడ ఉన్నారని సుప్రీం వ్యాఖ్యానించింది. గోవా ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఏకంగా స్పీకర్లే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వైనాన్ని కళ్లారా చూసిన తర్వాత కూడా స్పీకర్లు నిష్పక్షపాతంగా వ్యవహరి స్తారని ఎలా ఆశిస్తామని ప్రశ్నించింది. పలురాష్ట్రాల్లో స్పీకర్లు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత కూడా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకొని ఎలా ఉండగలు గుతామని జస్టిస్ నారీమన్‌తో కూడిన ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై నిర్ణయం తీసుకునేందుకు ఇంకెంత సమ యం కావాలో అఫిడవిట్ రూపంలో తెలపాలంటూ కిందటి విచారణలో సుప్రీంకోర్టు స్వీకర్‌ను ఆదేశించిగా, ఈసారి ఏకంగా అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో పాటు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రంగంలోకి దిగారు. రాష్ట్ర సర్కారు తరపున వకాల్తా పుచ్చుకొని ఆయన అఫిడవిట్ దాఖలు చేయకుండా అసలు ఎంఎల్‌ఎ సంపత్ పిటిషన్ విచారణ యోగ్యమే కాదని వాదనలు ప్రారంభించారు. కేసును వెంటనే డిస్మిస్ చేయాలని వాదించారు. పార్టీ ఫిరాయింపుదారులపై ‘స్పీకర్ సకాలంలో స్పందిస్తారని’ హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసిన తర్వాత కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడిం చాలంటూ సుప్రీంకోర్టును పిటిషన్‌దారుడు ఆశ్రయించడం సరికాదని వాదిం చారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారమే తప్ప జోక్యం చేసుకునే హక్కు న్యాయస్థానాలకు లేదని అన్నారు. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని ఫిరాయింపులపై అంతిమ నిర్ణయాన్ని హైకోర్టు స్పీకర్‌కు వదిలేసిందని పేర్కొన్నారు. ఈ వాదనలను పిటిషన్‌దారుడి తరుపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కొట్టిపారేశారు. సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు న్యాయస్థానాలకు లేకపోయినా స్పీకర్‌కు ఉండే ‘క్వాసీ జ్యూడిషిల్ పవర్స్’లో జోక్యం చేసుకొనే హక్కు న్యాయస్థానాలకు ఉందని వాదించారు. దీంతో ఇరువు రు న్యాయవాదుల మధ్య స్పీకర్ అధికారాలు, బాధ్య తలపై వాడీవేడి వాదనలు కొనసాగాయి. స్పీకర్లకు ది శానిర్దేశం చేస్తూ ఇప్పటివరకు దేశ చరిత్రలో న్యాయ స్థానాలు ఆదేశాలు జారీ చేయలేదని అటార్ని జనరల్ వాదించారు. సుప్రీం ఇచ్చే తీర్పు ఈ ఒక్క కేసుకు మా త్రమే ముడిపడదని అన్ని రాష్ట్రాల స్పీకర్లకు వర్తిస్తుం దని అన్నారు. స్పీకర్లకు గైడ్‌లైన్స్ జారీ చేసే సంప్రదా యానికి తెరలేపొద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతోజోక్యం చేసుకున్న ధర్మాసనం పార్టీ ఫిరాయిం పులపై స్పీకర్లు నిర్ణయం తీసుకున్న తర్వాత సదరు నిర్ణయాన్ని సమీక్షించే హక్కు తమకు ఉన్నప్పుడు, మ రి సదరు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే జోక్యం చేసు కునే హక్కు ఉండదా అని అటార్ని జనరల్‌ను ప్రశ్నిం చింది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేని స్పీకర్ అనర్హతకు గురికారా అని నిలదీసింది. నేటి స్పీకర్ల పాత్రను ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్ర జాస్వామ్యం మంటగలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన అటార్ని జనరల్ తన వాదనలను సమర్థించుకునేందుకు స్పీకర్ వ్యవహారా ల్లో జోక్యం చేసుకునే హక్కు న్యాయస్థానాలకు లేదం టూ 90 దశకంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ను ఉదహరించారు. మధ్యలో కల్పించుకున్న జస్టిస్ నారీమన్ 2౦ ఏళ్ల కిందటి పరిస్థితులు ఇప్పుడెక్కడ ఉన్నాయని అన్నారు. కాలమాన పరిస్థితులకు అనుగు ణంగా అంతా మారాల్సిందే అని అన్నారు. అయితే ఆయా తీర్పులన్నీ ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాలు ఇచ్చినందున ఈ కేసును ఐదు గురు సభ్యుల ధర్మాసనంకు అప్పగిస్తున్నట్లు వెల్లడిం చారు. ఇక ఈ కేసును అక్కడే తేల్చుకోవాలని సూచిం చారు. విచారణ ముగిసిన అనంతరం పిటిషన్‌దారుడి తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు స్వ యంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వైణా న్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు తగిన ఏర్పాట్లు చే స్తుందనే విశ్వాసం తనకు ఉందని అన్నారు. ఫిరా యింపుదారులను ఐదేశ్ల పాటు కాపాడేందుకు ఆస్కా రం ఇస్తున్న వెసులుబాటును మార్చాల్సిన సమయం ఆన్నమైందని అన్నారు. లేదంటే ఎన్నికలకు అర్థమే ఉందని అన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ సంపత్ మా ట్లాడుతూ రాష్ట్ర సర్కారుపై దుమ్మెత్తిపోశారు. పార్టీ ఫి రాయింపులతో రాజకీయ వ్యభిచారానికి రాష్ట్రాన్ని కేం ద్రంగా మార్చి తెలంగాణకు సీఎం కేసీఆర్ కళంకం తెచ్చారని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టిఆర్‌ఎస్‌కు అఖండ విజయం తప్పదని సర్వేలు చెబుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న సీఎం దమ్ముంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 24 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు దిగాలని సవాల్ విసిరారు. న్యాయవ్యవస్థ ఛీ కొట్టిన తర్వాత కూడా ఆనైతికంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగించడం సిగ్గుచేటని కాంగ్రెస్ అధికార ప్రతిని ధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు.