Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

ఈ ఎడారి.. ఫొటోషూట్‌కు రహదారి…

The biggest Salt Flat in the world Salar de Uyuni in Bolivia

ఫొటోగ్రఫీపైన ఇష్టం ఉన్న వారికి మనం ఇక్కడ చూస్తున్న ఉప్పు సముద్రంలో నచ్చిన విధంగా రకరకాలైన ఫొటోలను తీసుకోవచ్చు. కొత్తగా పెళ్లయిన వారు ఈ మధ్యకాలంలో ప్రీవెడ్డింగ్ అని అందమైన ప్రదేశాలను ఎంచుకుని వారికి నచ్చిన విధంగా ఫొటోలు దిగుతుంటారు. అలాంటి జంటలు ఫొటోషూట్‌లో పాల్గొనడానికి ఎక్కువగా ఇక్కడకి వస్తుంటారు. దక్షిణ అమెరికాలోని బోల్వియా అనే ప్రాంతంలో ఈ ఉప్పు సముద్రం ఉంది. దీని పేరు సలార్ డీ ఉయూనీ. ఈ సముద్రం మొత్తం సుమారు 10, 582 చదరపు కిలోమీటర్ల  మేర 3,656 మీటర్లు సముద్రమట్టానికి ఎత్తులో ఉంటుంది. దాదాపు 30 నుంచి 40 వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో చిన్న చిన్న నదులు పారేవి. అలా అవన్నీ ఎండిపోయి రూపాంతరం చెందాయట. ఈ ప్రాంతంలో ఎక్కువగా లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు ఇక్కడి నుంచే ఉప్పు నిల్వలు పలు ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతాయి. అంతే కాదు ఫ్లెమింగ్ పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. ఈ ఎడారిలో చలికూడా ఎక్కువగానే ఉంటుందంట. ఇక్కడ ఉష్టోగ్రత అంటే … 21 డిగ్రీల సెంటీగ్రేడులు. నవంబర్ నుంచి జనవరి వరకు ఈ ఉష్టోగ్రత అక్కడ నమోదవుతుంది. మిగతా కాలాల్లో 13 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగులు జరుగుతాయి.

Comments

comments