Home జాతీయ వార్తలు పిచ్చికుక్కల దాడిలో బాలుడు మృతి

పిచ్చికుక్కల దాడిలో బాలుడు మృతి

The Boy died in Mad Dogs Attack at Kakinada

కాకినాడ : పిచ్చికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన కాకినాడలోని బాలాజీ చెరువు సమీపంలో శనివారం ఉదయం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీకాంత్ (6) అనే బాలుడిపై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే చనిపోయాడు. కాకినాడలో వీధి కుక్కల స్వైరవిహారంపై అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నగరంలో వీధి కుక్కలను ఏరివేయాలని వారు కోరారు.

The Boy died in Mad Dogs Attack at Kakinada