Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

వేగంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పనులు

Bridge-image

వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి బ్రిడ్జి
దేశంలోనే అతిపెద్ద రికార్డు సృష్టించనున్న కేబుల్ బ్రిడ్జి
జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో తగ్గనున్న రద్దీ

మన తెలంగాణ/సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మకమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. దేశంలోనే ఈ కేబుల్ బ్రిడ్జి అతి పెద్దదిగా రికార్డు సృష్టించనుంది. సిగ్నల్ రహిత రహదారుల ఏర్పాటులో భాగంగా వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్‌ఆర్‌డిపి) ద్వారా జిహెచ్‌ఎంసి భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టిన విషయం తెల్సిందే. అందులో భాగంగా అత్యంత రద్దీ ప్రాంతమైన జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాలను అనుసంధానించడంలో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవుగల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పునాధులు(ఫౌండేషన్లు), ఉప నిర్మాణాలు (సబ్ స్టక్చ ర్లు) పూర్తి కాగా, సూపర్ స్టక్చర్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నా యి. గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జి ఇప్పటి వరకు అతి పెద్దదిగా ఉంది. దుర్గం చెరువుపై నిర్మాణం పూర్తయి తే దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డులకెక్కనుంది. 2019 మార్చి మాసంలోగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలనే లక్షంతో జిహెచ్‌ఎంసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు శ్రమిస్తున్నారు. ఈ బ్రి డ్జి నిర్మాణం పూర్తితో మాదాపూర్, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం గణనీయంగా తగ్గడంతో పాటు సుందర పర్యాటక ప్రాంతంగా రూపొందనుం ది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేష్లు పూర్తికాగా 12 పిల్లర్ల ని ర్మాణం పూర్తయింది. ప్రధాన బ్రిడ్జికి సంబంధించి మొదటి సెగ్‌మెంట్ రీ ఇన్‌ఫోర్స్‌మెంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. స్టే కేబుళ్లను ఆ స్ట్రీ యా దేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. బ్రిడ్జి బిల్డర్ పనులు పురోగతి తో ఉండగా, ట్రాక్ భీం ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నా యి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి ప్రీ కాస్టింగ్ పనులు కోండాపూర్‌లో జరుగుతున్నాయని జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి చెప్పా రు. 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తుతో ఉండే ప్రధాన బ్రిడ్జి పనులు కొండాపూర్‌లో ప్రీ కాస్టీంగ్ నిర్మాణ పద్ధ్దతిలో పురోగతిలో ఉన్నాయి. రా ష్ట్ర మున్సిపల్ శాఖమంతిర కె.టి.రామారావు, మేయర్ బొంతు రామ్మోహన్‌లు ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కమిషనర్ వె ల్లడించారు.

కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో కలిగే సౌకర్యాలు
హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఐకానిక్‌గా
రూపొందనుంది.
రోడ్డు నెంబర్ 36, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లపై ఒత్తిడి గణనీయంగా
తగ్గుతుంది.
జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పెస్, గచ్చిబౌలిలకు సుమారు రెండు కి.మీ
మేర దూరం తగ్గనుంది.

Comments

comments