Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లోయలో పడిన బస్సు : 10 మంది మృతి

Bus-Felt-in-Valley

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు లోయలో పడింది. రిషికేశ్ – గంగోత్రి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది చనిపోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్ట తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

The Bus Fell into the Valley : 10 People Dead

Comments

comments