Home జాతీయ వార్తలు వైసిపి ఎంఎల్‌ఎపై కేసు నమోదు

వైసిపి ఎంఎల్‌ఎపై కేసు నమోదు

The Case was Registered Against the YCP MLA

విజయవాడ : వైసిపి ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. క్రికెట్ బూకీలతో ఆయనకు సంబంధాలు ఉన్నట్టు ఎసిబి అధికారులు నిర్ధారించారు. విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రధాన బూకీ కృష్ణసింగ్ అనుచరులతో కోటంరెడ్డి పలుమార్లు సమావేశమైనట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. హోటల్ బిల్లులను, సిసి పుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణసింగ్‌కు కోటంరెడ్డి ఆశ్రయం ఇచ్చారని, కృష్ణసింగ్ కోర్టులో లొంగిపోవడానికి కూడా కోటంరెడ్డి సహకరించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కృష్ణసింగ్ నుంచి కోటంరెడ్డి రూ.23 లక్షలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి నివేదికను నెల్లూరు ఎస్‌పి రామకృష్ణ డిజిపి మాలకొండయ్యకు ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఎసిబి డిజి ఠాగూర్‌ను డిజిపి మాలకొండయ్య ఆదేశించారు.

The Case was Registered Against the YCP MLA