Home నాగర్ కర్నూల్ సొరంగం ప్రమాదంపై సిబిఐచే దర్యాప్తు జరిపించాలి

సొరంగం ప్రమాదంపై సిబిఐచే దర్యాప్తు జరిపించాలి

The CBI should investigate the tunnel accident

జూరాల నుంచి వచ్చే ఈ ప్రాజెక్టును కెఎల్‌ఐకి మార్చారు
డిజైన్ మార్పువల్ల రూ.1000 కోట్లు అదనపు భారం
వనపర్తి ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి

మన తెలంగాణ/కొల్లాపూర్‌: మండల పరిధిలోని ఎల్లూరు సమీపంలో పాలమూర్, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఎల్లూరు రిజర్వాయర్ సమీపంలో మొదటి ప్యాకెజిలో చేపట్టిన సొరంగంలో జరిగిన ప్రమాదం సంఘటన స్థలాన్ని వనపర్తి శాసన సభ్యులు డాక్టర్ చిన్నారెడ్డి,కొల్లాపూర్ నియోజకవర్గం ఇన్‌ఛార్జీ భీరం హర్షవర్థన్‌రెడ్డిలు గురువారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీ లించారు. బుధవారం జరిగిన బ్లాస్టింగ్‌లో ఇద్దరు కార్మికులు మృతి చెంది 14మంది కార్మికులు తీవ్రగాయాలపాలు కావడంతో ఈసంఘటన అందుకు స్పందించిన కాంగ్రెస్ బృందం పర్యాటించారు. ఈసందర్భంగా సొరంగంలోకి కాంగ్రెస్ బృందం వెళ్ళి అక్కడ జరిగిన బ్లాస్టింగ్ వివరాలను తెలుసుకు న్నారు. ఈ సంఘటనపై ప్రాజెక్టు సుపర్‌వైజర్ గంగధర్ కొన్ని వివరాలను ఎమ్మెల్యే చిన్నారెడ్డి వివరించారు. ఇందుకు సంబందించిన కార్మికుల లిస్ట్ తమకు కావాలని ఎమ్మెల్యే అడగడంతో సుపర్‌వైజర్ లిస్ట్ తమ దగ్గరలేదని ఇందుకు సంబందించి సభ్ కాంట్రాక్టర్ ఉంటారని సమాధానం చెప్పారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చిన్నారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ, పాలమూర్, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబందించి ఈ సొరంగం అవసరం లేకుండా ఒపన్ సర్జుపుల్‌ద్వారా నీటిని తీసుకెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ తెలిపిన పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈడిజైన్ మార్చినప్పుడు కాంగ్రెస్‌పార్టీ నిరసన తెలిపి ఇందుకు 1000కోట్ల భారం ప్రభుత్వానికి పడుతుందని డిజైన్ మార్పును రద్దు చేయాలని కోరిన సియం కెసిఆర్ నేనే పెద్ద ఇంజనీయర్‌ను అని తనకంటే పెద్ద ఇంజనీరు లేరని ఇలా చేశారని ఆయన గుర్తు చేశారు.ఇక్కడ పనులు చేపట్టిన నవయుగ కంపినీ కాంట్రాక్టర్ విశ్వేశ్వర్‌రెడ్డి వనపర్తిలో కూడా ఇలాగే డిజైన్ మార్చాలని చూస్తే తాను అడ్డుకున్నానని ఆయన గుర్తు చేశారు.పాలమూర్,రంగారెడ్డి డిజైన్ మార్చవద్దని పెద్దపెద్ద ఇంజనీర్లు చెప్పిన సియం కెసిఆర్ పెడచెవిన పెట్టారని ఆయన అన్నారు. ఈప్రాజెక్టులో జరిగిన ప్రమాదంపై సిబిఐ సంస్థచే దర్యాప్తు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.కార్మికుల జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. వారి ప్రాణాలకు భద్రత లేకుంటే ఎలా అని ప్రశ్నించారు.ఇక్కడ సిబ్బంది పిడుగు పాటుకు బ్లాసింగ్ అయిందని చెప్పడం అనుమానంగా ఉందన్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదంలో స్థానికులు అయి ఉంటే అన్ని వివరాలు త్వరగా తెలిసేవని ఆయన అన్నారు.కెఎల్‌ఐ దగ్గరనుండి సొరంగం ద్వారా నీటిని తీసుకపోవడం ద్వారా కెఎల్‌ఐ ప్రాజెక్టుకు ముప్పువాటిల్లిందన్నారు.వేలాది సంవత్సరాలు ఉండే ఈప్రాజెక్టు నిర్మాణం డబ్బులకు కక్కుర్తిపడి సియం కెసిఆర్, అధికారులు ఈడిజైన్ మార్పు కార్యక్రమాన్ని తీసుకుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌ఛార్జీ భీరం హర్షవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈప్రాజెక్టుకు సంబందించి గ్రీన్ టిబ్యునల్ కేసు పెండింగిలో ఉందని డిజైన్ మార్చి సొరంగం పనులు చేపట్టిన ప్రభుత్వం పొట్టచేత పట్టుకోని సుదూర ప్రాంతంనుండి వచ్చిన కూలీల కుటుంబాలకు ఏమి సమాధానం చెప్పుతారని ఆయన ప్రశ్నించారు.కంపినీ అధికారులు చాలా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తక్షణ సహయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన
చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకు లు గౌరరం వెంకట్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాటం జంబులయ్య, కోడేరు మండల అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షులు గణేష్ రావు, కొల్లాపూర్ మండల అధ్యక్షులు ముచ్చర్ల రామచందర్‌యాదవ్, పెంట్లవెల్లి ఎంపిటిసి పల్లే నాగరాజు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కిషన్‌నాయక్, నాయకులు రత్న ప్రభాకర్‌రెడ్డి, కిసాన్‌కేత్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌యాదవ్ సురేందర్‌సింగ్, మూలే కేశవులు, రుక్మాద్దిన్, తదితరులు పాల్గొన్నారు.