Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అసలు రూపు

ind1

ఎస్‌సి,ఎస్‌టి చట్టానికి అసలు రూపు

బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ : ఎస్‌సి,ఎస్‌టి చట్టం మూలస్వరూపం దెబ్బతినకుండా ఉండేందుకు పార్లమెంట్‌లో ఒక బిల్లును తీసుకురానుంది.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో దీనికి ఆమో దం తెలిపారు. చట్టంలో ఉన్న పూర్వపు నిబంధనల పునరుద్ధరణకు వీలుగా ఈ బిల్లును రూపొందించడం జరిగిందని అత్యున్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్‌సి/ఎస్‌టి చట్టం నిబందనలలో మార్పులకు వీల్లేకుండా ఈ బిల్లును కేంద్రం తలపెట్టింది. ఈ ఏడాది మార్చిలో ఈ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టం పరిరక్షణ కోణంలో నిబంధనలలో మార్పులను పేర్కొంటూ రూలింగ్ ఇచ్చింది. అయితే ఈ రూ లింగ్ చట్టంలోని ఇంతకు ముందటి నిబంధనలకు తూట్లు పొడిచేవిగా ఉన్నాయని దళిత నేతలు, సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ రూలింగ్‌కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రదర్శనలు సాగాయి. హిం సాకాండ చెలరేగింది. ఇక ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు నిచ్చాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు కేంద్రం చట్ట పరిరక్షణ కోణంలో ఈ బిల్లును తీసుకువచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిల్లును పార్లమెంట్‌లో ఆమోదానికి పెడుతారని పేర్కొన్నారు. అయితే ఎప్పుడునేది వెల్లడించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు చెల్లనేరకుండా చేసేందుకు కేంద్రం తక్షణం కొత్త చట్టం తీసుకురావల్సి ఉందని లేకపోతే దళితుల ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతుందని ఇటీవలే బిజెపి మిత్రపక్షం లోక్‌జనశక్తి నేత, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ హెచ్చరించారు. అధికార పార్టీ బిజెపికి చెందిన పలువురు దళిత ఎంపీలు , గిరిజన నేతలు కూడా ఆయన వాదనను సమర్థించారు. ఈ నేపథ్యంలో కేంద్రం తక్షణం ఈ కీలక బిల్లుకు రూపకల్పన చేసినట్లు స్పష్టం అయింది.
జిఎస్‌టి చట్టాల సవరణలకు ఆమోదం : కేంద్ర మంత్రి మండలి సమావేశం లో జిఎస్‌టి చట్టాల సవరణలకు ఆమోదం తెలిపారు. కాంపోజిషన్ స్కీమ్ డీలర్స్ పరిధిలోకి వచ్చే పరిమితిని ఒకటిన్నర కోట్లకు పెంచడం కూడా ఇందు లో ప్రధానంగా ఉంది. సెంట్రల్ జిఎస్‌టి చట్టాలు, అనుబంధ జిఎస్‌టి చట్టాలు, పరిహార సెస్ లాకు సవరణలను ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడుతారని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం మీద 46 సవరణలు ఉంటాయని , యాజమాన్యాలు ఉద్యోగులకు కల్పించే ఆహారం, రవాణా, బీమా సౌకర్యాలకు ప్రతిగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందేందుకు వీలు ఏర్పడుతుంది.

Comments

comments