Home జాతీయ వార్తలు గుడిలో మహిళపై అత్యాచారం..

గుడిలో మహిళపై అత్యాచారం..

The chief priest of the temple was raped by a woman

నొయిడా: గుడి ప్రధాన పూజారి ఓ మహిళపై అత్యాచారం చేసిన దారుణ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలోని నొయిడాలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన బదలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధూమ్ మానిక్‌పూర్ గ్రామంలో జులై 9 న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు తన బంధువుతో కలిసి గుడికి వెళ్లింది. అనంతరం గుడి పూజారి ఆ మహిళను పిలవడంతో రూమ్‌లోకి వెళ్లిన మహిళపై పూజారి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం వెతకటం ప్రారంభించారు. నిందితుడు స్వామి కన్హయ్య నంద్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.