Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మెడికల్ టూరిజం హబ్ గా… భాగ్య నగరం

hyderabad-imageనగరానికి పెరిగిన విదేశీ రోగులు గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిన రోగులు సర్జరీలకు కేరాఫ్‌గా హైదరాబాద్

మన తెలంగాణ/సిటీబ్యూరో : ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు నగరంలో వాలిపోతున్నాయి. ఫార్మా రంగంలోనూ నగరం శరవేగంగా పురోగమిస్తోంది. సేఫ్టీ సిటీగా మన్ననలు పొందుతోంది. వీటన్నింటికి తోడు ఇప్పుడు మెడికల్ టూరిజంలోనూ నగరం తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. విదేశాల్లో సాధ్యంకానీ సర్జరీలు చేస్తూ నగర వైద్యులు అందరి మన్ననలు పొందుతున్నారు. దాదాపు 25దేశాల నుంచి రోగులు వైద్యం కోసం నగరానికి వస్తున్నారు. ప్రతి ఏటా నగరానికి వస్తున్న మెడికల్ టూరిస్టులు క్రమంగా పెరుగుతున్నారు. గత ఏడాది తో పోలీస్తే ఈ ఏడాది విదేశీ రోగులు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. అందులోనూ హైదరాబాద్ వైపు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పాటు అత్యాధునిక వైద్య పరికరా లు, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉండటమే అం దుకు కారణం. దాదాపు 25దేశాల నుంచి వైద్యం కోసం నగరానికి వ స్తుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆఫ్రికా, యునైటెడ్ ఎమిరేట్స్ నుంచి ఎక్కువగా రోగులు వస్తుండటం గమనార్హం. నైజీరియా, సుడాన్, మిడి ల్ ఈస్ట్ దేశాలైన ఒమన్, ఇరాక్, యెమెన్, బంగ్లాదేశ్, అఫ్గాన్‌ల నుంచి వైద్యంకోసం ఇక్కడికి వస్తున్నారు. ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కి ఒమన్, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి రోగులు ఎక్కువగా వస్తున్నారు. నగరం మెడికల్ టూరిజంలో నాల్గో స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై తరువాత హైదరాబాద్‌కే అత్యధికంగా వైద్యం కోసం వస్తున్నారు. ఎక్కువగా సర్జరీలకోసం వస్తున్నారు. ఇలా వచ్చే వారు హార్ట్ సర్జరీ, జాయింట్ రీప్లేస్‌మెంట్, బరియాటిక్ సర్జరీ, డెంటల్ ట్రీట్‌మెంట్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్, గ్యాస్ట్రోలజీ వంటి చికిత్సలు నగరంలో పొందుతున్నారు.

వైద్యం మీద విశ్వాసంతో
హైదరాబాద్‌లో మంచి వైద్యం లభిస్తుందన్న విశ్వాసాన్ని నగర కార్పొరేట్ వైద్యశాలలు అందిస్తున్నాయి. ఇప్పటికి లక్షల్లో విదేశీయులు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో విదేశీ రోగుల కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ బ్లాక్‌ని సైతం ఏర్పాటు చేస్తున్నారంటే నగరంలో విస్తరిస్తున్న మెడికల్ టూరిజం వేగాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఖర్చు కూడా తక్కువే
లక్షలు ఖర్చు చేసి అమెరికా వంటి దేశాలకు వైద్యం కోసం వెళ్లాలంటే సవా లక్ష ఆంక్షలు ఎదురవుతాయి. ఒక వేళ అ న్నింటిని ఎదురుకొని అంతదూరం వెళ్లినా అక్కడ కూడా భారతీయ వైద్యులే చికిత్స అందిస్తుండటం గమనార్హం. కానీ భారతదేశంలో చికిత్స కోసం వచ్చే వారికి ఎలాంటి ఆంక్షలు ఉండ వు. ఇక ఖర్చు విషయంలో హైదరాబాద్ వైద్యంతో పోల్చుకుంటే అమెరికాలో 20రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒక సర్జరీకి ఇక్కడ రూ.15 వేలు వెచ్చిస్తే, అదే విదేశాల్లో అయితే రూ.లక్ష చెల్లించాల్సి వస్తోంది. వీటితో పాటు నగర వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్‌లో చికిత్స కోసం ఎక్కువ మంది విదేశీయులు భాగ్య నగరం వైపమొగ్గుచూపుతున్నారు.

Comments

comments