Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆపదలో అలెప్పో

Aleppo-in-Syria20 లక్షల మందికి సరఫరాలు బంద్, సహాయక బృందాలకు మూసుకుపోయిన రహదారులు 

డెమాస్కష్ : సిరియాలోని అలెప్పో నగరంలో 20 లక్షల మంది ప్రజలు పూర్తి దిగ్బంధనలో పడిపోయే ప్రమాదం ఏర్పడింది. భారీగా బాంబు దాడులకు గురైన ఆ నగరాన్ని తక్షణమే సహాయక దళాలు చేరుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఇటీవల కొన్ని వారాలుగా ఆ నగరంలో తిరుగుబాటుదారులు, ప్రభుత్వ అనుకూల సైన్యం, ప్రత్యర్థి సేనలు పరస్పరం భీకరంగా కలహించుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో నగర పౌరులు మూడు విధాలుగా దిగ్బంధానికి గురవుతున్నారు. దాదాపు 20 లక్షల మంది తీవ్ర భయాందోళనల్లో, సరఫరాలు కొరవడిన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ఆ నగరంలో జరుగుతున్న ఘర్షణల్లో  130 పౌరులు జులై నెలాఖరుదాక మరణించారు. ఆస్ప్ర తులు, విద్యుత్ సరఫరా సౌకర్యాలు, నీటి సరఫరా వ్యవ స్థ పూర్తిగా దెబ్బతింది. నగర జనాభాకు సహాయప డ్డానికి ఐక్యరాజ్య సమితి సిద్ధంగా ఉంది. ఆ నగరానికి మాన వతా సహాయక బృందాలు చేరుకోవాలంటే కనీసం 48 గంటల పాటు కాల్పుల విరమణ తక్షణం అమలులోకి రావాలి. జులై మధ్యలో నగర రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి.

నగర ఆస్పత్రుల్లో ఔషధాల నిల్వలు పడిపో యాయి. తక్షణం సమితి సహాయ బృందాలు నగరాన్ని చేరుకోక పోతే పరిస్థితి విషమిస్తుంది. తూర్పు అలెప్పీలో 2 లక్షల 75 వేల మంది పౌరులు ఘర్షణల మధ్య చిక్కడిపోయి ఉన్నారు. జున్ నెలలో అలెప్పో పోరాటం తీవ్ర రూపం దాల్చింది. కాస్టేలో రోడ్డును ప్రభుత్వ అను కూల సైన్యం ఆక్రమించడంతో ఘర్షణలు మిన్నంటాయి. సిరియా తూర్పు జిల్లాలో ఈ నేపథ్యంలో ధరలు తీవ్రంగా పెరగడానికి కారణమయింది. నగరంలోని రహదారులన్నీ రెబెల్స్, ఇస్లామిస్టులు, జీహా దిస్టుల సంకీ ర్ణ ముఠాల ఆక్రమణలో ఉన్నాయి. తక్కినవి ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక సేనల పట్టులో ఉన్నాయి. ఎవరి ఆధీ నంలోని ప్రాంతాలలో వారు సరఫరాల బాధ్యత వహిస్తు న్నారు. తక్కిన ప్రాంతాలలో పౌరులను పట్టించుకొనే వారు లేరు. ఉద్దేశపూర్వకంగా ఆహార సరుకుల సర ఫరాను బందు చేయించడం యుద్ధ నేరాల కిందకు వస్తుందని ఐక్య రాజ్య సమితి ఈ సందర్భంగా హెచ్చ రించింది. 2011 మార్చిలో సిరియా సంక్షోభం మొద లైనప్పటి నుంచి 2 లక్షల 90 వేల మంది మరణించారు.

Comments

comments