Home ఎడిటోరియల్ సిరియా : ఐరాస గాజుకన్ను

సిరియా : ఐరాస గాజుకన్ను

edit2

సిరియాలో ఈ ఘోరకలి నేటిది కాదు. 2011 నుంచి కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే ఇరాక్‌లో మాదిరిగా ప్రపంచదేశాలు అమెరికా ఒంటెద్దు పోకడను ఈ సారి ఒప్పుకోలేదు కాని, లేకపోతే ఇరాక్ మాదిరిగా, అఫ్గనిస్తాన్ మాదిరిగా, లిబియా మాదిరిగా ఎప్పుడో నేలమట్టమైపోయి, ఆ శిధిలాల్లో ఎంతమంది పసిపిల్లలు సమాధయ్యారన్న వార్తలు కూడా బయటకు పొక్కేవి కావు. ఇరాక్‌లో దాదాపు 5 లక్షల మంది పసిపిల్లల మరణాలకు కారణమైనప్పటికీ సగర్వంగా మానవహక్కుల గురించి అమెరికా చెప్పుకోగలుగుతుంది.

ఐయస్‌ఐయస్ వంటి ఉగ్రవాద సంస్థపై ప్రపంచంలో ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికా, నాటో దళాలు ఎందుకు విజయం సాధించలేకపోతున్నాయన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఇటీవల ఇస్రాయీల్ పార్లమెంటులో అక్కడి పార్లమెంటు సభ్యురాలే ఇస్రాయీల్ చవగ్గా చమురు ఐయస్‌ఐయస్ నుంచి కొంటుందని ఆరోపించింది. ఐయస్‌ఐయస్ లో ఇస్రాయీల్ గూఢచార సంస్థ మొస్సాద్ ఏజంట్లే ఉన్నారన్న వార్తలు బలంగా వస్తున్నాయి. లిబియాలో పట్టుబడిన ఐయస్‌ఐయస్ ఉగ్రవాది మొస్సాద్ ఏజంటని తేలింది. అసలు ఐయస్‌ఐయస్ అంటేనే ఇస్రాయీల్ సీక్రెట్ ఇంటిలిజెన్స్ సర్వీస్ అన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఐయస్‌ఐయస్ అధినేత బగ్దాదీకి శిక్షణ ఇచ్చింది మొస్సాద్ అనీ, ఆయన యూదుడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇస్రాయీల్ తన ప్రయోజనాల కోసం లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగించడానికి ఐయస్‌ఐయస్ ను వాడుకుంటుందన్న వాదనలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి సిరియాలో ఐయస్‌ఐయస్ ను పూర్తిగా తుడిచేయడానికి అమెరికా నిజంగా ప్రయత్నిస్తుందా అన్నది అనుమానాస్పదం.

సాధారణ పౌరులు ఆ ప్రాంతం వదిలి వెళ్లడానికి వీలుగా 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సిరియా నియంత బషారుల్ అసద్ ఈ పట్టణంపై సైన్యాలను నడిపించాడు. రష్యా యుద్ధవిమానాలు ఈ సైన్యానికి అండగా బాంబులు కురిపించాయి. దాదాపు 550 మంది సాధారణ పౌరులు మరణించారని వార్త. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగల్లో తొక్కుతూ సిరియా, రష్యా దేశాలు దాడులను కొనసాగిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. కాని రష్యా వాదన మరో లా ఉంది. కాల్పుల విరమణ సందర్భంగా మానవీయ సహాయానికి ఉద్దేశించిన మార్గాలపై తిరుగుబాటు దళాలు దాడులు చేశాయని, ప్రతిచర్య తప్పదని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో అల్ ఖాయిదాకు సంబంధించిన టెర్రరిస్టు సంస్థలు జబత్ ఫతే అల్ షామ్ వంటి వాటిపై దాడులు కొనసాగిస్తామని ప్రకటించింది. మరోవైపు టర్కీ కూడా అమెరికా ద్వంద్వప్రమాణాలు పాటిస్తుందని ఆరోపించింది. టర్కీ కూడా సిరియా పట్టణం ఆఫ్రీన్ పై దాడులు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇది విరుద్దమంటూ అమెరికా చేసిన ఆరోపణను టర్కీ తిప్పి కొట్టింది. ఈ తీర్మానంలో ఆఫ్రీన్ ప్రస్తావనే లేనప్పుడు టర్కీ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని నిలదీసింది. ఇటీవల టర్కీ చాలా తీవ్రమైన హెచ్చరికలు అమెరికాకు చేసిందన్నది కూడా గుర్తుంచుకోవాలి. టెర్రరిస్టులు ఎవరైనా ఒక్కటే. మంచి టెర్రరిస్టులు, చెడ్డ టెర్రరిస్టులు లేరు. అమెరికా మతి లేకుండా మాట్లాడుతోంది. ఈ ద్వంద్వ ప్రమాణాలకు మేం ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది.
అమెరికా, పాశ్చాత్య సంస్థల నుంచి వచ్చే వార్తలకు, రష్యా, మధ్యప్రాచ్య వార్తా సంస్థలు చెప్పేదానికి పొంతన ఉండడం లేదు. రష్యా దారుణాలకు పాల్పడుతుందని పాశ్చాత్య మీడియా వార్తలు చూపిస్తుంటే, అమెరికా, పాశ్చాత్య దేశాల అమానుష విధానాల గురించి రష్యా మీడియా చెబుతుంది. ఎవరిని నమ్మాలో తెలియని ఒక అయోమయం.
అసలు సిరియాలో ఏం జరుగుతోందన్నది మాట్లాడే ముందు సిరియాలో ఎవరి అధికారం ఉంది, ఎవరి నియంత్రణలో ఉందన్నది ముందు మాట్లాడుకోవాలి. మార్చి 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు నాలుగున్నర లక్షల మంది మరణించారు. పదిలక్షల మంది గాయపడి ఉంటారు. దాదాపు కోటి ఇరవై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అంటే దేశజనాభాలో సగం మంది ఇల్లూ వాకిలి వదిలి శరణార్ధులయ్యారు. ఇప్పుడు దారుణమైన దాడులకు సంబంధించి వార్తలు వస్తున్నది తూర్పు ఘౌటా పట్టణం నుంచి. ఈ పట్టణం తిరుగుబాటు దారుల నియంత్రణలో ఉంది. రాజధాని డమస్కస్ కు దగ్గరగా ఉన్న పట్టణం కాబట్టి దీన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలని సిరియా ప్రభుత్వం దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలున్నారు. ఇప్పటికీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా సిరియా ప్రభుత్వం ఈ పట్టణాన్ని దిగ్బంధం చేసి ఉంచింది. ఉత్తర సిరియాలో ఆఫ్రీన్ పట్టణంపై సిరియా నియంత బషారుల్ అసద్ సైన్యాలు కూడా టర్కీ దాడులను ఎదిరిస్తున్నాయి. అక్కడ కుర్దు వైపిజి మిలిషియాను అంతం చేయాలని టర్కీ ప్రయత్నిస్తోంది. ఈ పట్టణం కుర్దు మిలిషియా నియంత్రణలో ఉంది. కుర్దు మిలిషియా అసద్ సైన్యాల సహాయం కోరింది. కుర్దులకు, సిరియా ప్రభుత్వానికి మధ్య సైనిక ఒప్పందం ఉంది. అందువల్ల సిరియా ప్రభుత్వం వారికి సహాయంగా సైన్యాన్ని పంపించింది. కాని విచిత్రమేమంటే, సిరియా అధ్యక్షుడు అసద్ ను గద్దె దించాలని కోరుతున్న అమెరికా కుర్దులకు సహాయం చేస్తోంది. ఇదొక అయోమయ పరిస్థితి. ఎవరు ఎవరికి శత్రువో ఎవరు మిత్రుడో తెలియని ఒక గందరగోళం అక్కడ నెలకొని ఉంది. అమెరికా ప్రత్యేక దళాలు అంటే అమెరికన్ సైనికులు కాదు, కుర్దు మిలిషియాకు అమెరికా శిక్షణ, ఆయుధాలు ఇచ్చి నియమించిన దళాలు టర్కీ పై పోరాడుతున్నాయి. అసలు సిరియా ప్రభుత్వం, అంటే బషారుల్ అసద్ నియంత్రణలో ఉన్న భూభాగం అలెప్పో, లటాకియా, టార్టస్, హమా, హమ్స్, డమస్కస్, పాల్మిరా, అబూ కమాల్ పట్టణాలు మాత్రమే. సిరియాలో ఐయస్‌ఐయస్ అదుపులో కూడా కొంత భూభాగముంది. రఖ్ఖా పోరాటం తర్వాత ఐయస్‌ఐయస్ చాలా భూభాగం కోల్పోయింది. అబూకమాల్ లో కొంత భూభాగం ఇప్పటికీ ఈ ఉగ్రవాద సంస్థ అదుపులోనే ఉంది. దీనికి పశ్చిమాన సిరియా ప్రభుత్వ దళాలు చుట్టుముట్టి ఉంటే తూర్పున కుర్దు దళాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ దిగ్బంధం కొనసాగుతోంది.
ఐయస్‌ఐయస్ వంటి ఉగ్రవాద సంస్థపై ప్రపంచంలో ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికా, నాటో దళాలు ఎందుకు విజయం సాధించలేకపోతున్నాయన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఇటీవల ఇస్రాయీల్ పార్లమెంటులో అక్కడి పార్లమెంటు సభ్యురాలే ఇస్రాయీల్ చవగ్గా చమురు ఐయస్‌ఐయస్ నుంచి కొంటుందని ఆరోపించింది. ఐయస్‌ఐయస్ లో ఇస్రాయీల్ గూఢచార సంస్థ మొస్సాద్ ఏజంట్లే ఉన్నారన్న వార్తలు బలంగా వస్తున్నాయి. లిబియాలో పట్టుబడిన ఐయస్‌ఐయస్ ఉగ్రవాది మొస్సాద్ ఏజంటని తేలింది. అసలు ఐయస్‌ఐయస్ అంటేనే ఇస్రాయీల్ సీక్రెట్ ఇంటిలిజెన్స్ సర్వీస్ అన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఐయస్‌ఐయస్ అధినేత బగ్దాదీకి శిక్షణ ఇచ్చింది మొస్సాద్ అనీ, ఆయన యూదుడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇస్రాయీల్ తన ప్రయోజనాల కోసం లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగించడానికి ఐయస్‌ఐయస్ ను వాడుకుంటుందన్న వాదనలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి సిరియాలో ఐయస్‌ఐయస్ ను పూర్తిగా తుడిచేయడానికి అమెరికా నిజంగా ప్రయత్నిస్తుందా అన్నది అనుమానాస్పదం.
హృదయవిదారకమైన వార్తలు సిరియా నుంచి వస్తున్నాయి. పసిపిల్లల ఆర్తనాదాల వీడియోలు వస్తున్నాయి. ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం. నిజానికి ఏమీ చేయలేని దుస్థితి ఐక్యరాజ్యసమితి ఏర్పాటులోనే ఉంది. ఎన్ని తీర్మానాలు ఐక్యరాజ్యసమితిలో వీటో అయ్యాయి. అగ్రరాజ్యాలకు వీటో హక్కు ఎందుకు లభిస్తోంది. భారతదేశం హాఫిజ్ సయీద్ గురించి మాట్లాడితే చైనా వీటో ఎందుకు చేస్తుంది. ఇస్రాయీల్ కోసం అమెరికా వీటో అధికారం ఎందుకు ఉపయోగిస్తుంది. అగ్రరాజ్యాల అడుగులకు మడుగులొత్తే బానిస సంస్థగా ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశారన్నది కాదనలేని యదార్థం. బడుగు బలహీనదేశాల్లో ప్రజల ఆర్తనాదాలను వినడమే కాని ఏమీ చేయలేని సంస్థగానే ఐక్యరాజ్యసమితి నేటి వరకు నిరూపించుకుంది.

వాహెద్
-7093788843