Search
Friday 16 November 2018
  • :
  • :

పాక్‌లో సంకీర్ణం తప్పదు

Pak : The Coalition in Pak

ఇస్లామాబాద్  : పాక్ జాతీయ ఎన్నికల్లో మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పార్టీ పిటిఐ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఎన్నికల ఫలితాల్లో పిటిఐ ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరైన సంఖ్యా బలం లేదు. దీంతో ఇతర పార్టీలతో పిటిఐ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 272 స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 251 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. పిటిఐ 110 స్థానాల్లో విజయం సాధించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పిఎంఎల్‌ఎన్ పార్టీ 63 స్థానాల్లో విజయం సాధించింది. బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించింది. 21 స్థానాల్లో ఇంకా ఫలితాలు వెల్లడికాలేదు. ఈ స్థానాల్లోని కొన్నింటిలో పిటిఐ ముందంజలో ఉంది. కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 137 మ్యూజిక్ ఫిగర్ పిటిఐ చేరుకోలేదు. పిటిఐకి మద్ధతు ఇచ్చేందుకు ఇతర చిన్న పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమం కావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ స్థానిక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా పిటిఐ ముందంజలో ఉంది.

The Coalition in Pak

Comments

comments