Home తాజా వార్తలు కలెక్టర్ గారు సూర తండాపై కరుణ చూపరు…

కలెక్టర్ గారు సూర తండాపై కరుణ చూపరు…

 

-ఏళ్ళు గడుస్తున్న ఉపాధి కార్డులు అందించని వైనం
-సూరతండాలో ఉపాధి కోసం గిరిజనుల ఎదుచూపు
-పట్టించుకోని అధికారులు
-నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూలీల డిమాండ్
కురవి : దేశంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న కూలీలకు పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింప చేసే దిశగా ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏళ్ళు గడుస్తున్న మండలంలోని నల్లెల్ల గ్రామ శివారు సూరతండాపై కలెక్టర్ కరుణ చూపి కుటుంబ ఉపాథి హామీ కార్డు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. సూరతండాని బుధవారం మన తెలంగాణ సందర్శించింది. దీంతో ఆ తండా వాసులు ఏళ్ళు గడుస్తున్న ఉపాధి హామీ కార్డులు కూడా అధికారులు ఇవ్వలేదని ఆవేధన వ్యక్తం చేశారు.
నిరుద్యోగ భృతి ఇవ్వాలి : 2005 అగస్టు 25న భారత రాజ్యాంగం ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏర్పడింది. తదుపరి జూన్ 2006 సంవత్సరంలో ప్రారంభించారు. చట్ట నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు కుటుంబ ఉపాధి హామీ కార్డు అందించి పని ధినాలు కల్పించాలని ఉంది. పని కల్పించని కూలీలకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ఉన్నప్పటికి అధికారులు ఇప్పటి వరకు తండాలో ఉపాధి కార్డులు చెల్లించలేదు. అందుకు అధికారులు నిరుద్యోగ భృతి ఇప్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి కార్డులు అందించని వైనం: ఉపాధి హామీ పనులు ప్రారంభించి 13 సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు సూరతండా గిరిజనులపై కనికరించలేదు. ఇప్పటి వరకు కనీసం తండాలో కుటుంబ ఉపాధి కార్డు ఇవ్వక పోగా అధికారులు తొంగిచూడలేదని గిరిజన కూలీలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాలలో ఉపాధి కల్పిస్తున్నారు కానీ ఎన్నిమార్లు అధికారులను అడిగిన పట్టించుకోలేదని గిరిజనలు వాపోతున్నారు.
ఉపాధి కార్డుల కోసం ఎదురుచూపు : భానోతు సుజాత
నిరుపేద ప్రజలకు కుటుంబ ఉపాధి కార్డులు అందించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఇక్కడి అధికారులు తూతూ మంత్రంగా వ్యవవహారిస్తున్నారు. దీంతో గిరిజన తండాలకు కనీసం కార్డులు ఇచ్చి పని కల్పించలేక పోతున్నారు. ఏళ్ళ తరబడి తండాలో ఉపాధి కార్డు కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
అధికారులు పట్టించుకోవడంలేదు : తేజావత్ సాలి
మండలంలోని నల్లెల్ల గ్రామంలో అందరికి ఉపాధి పని కల్పిస్తున్నారు. కానీ సూరతండాలో అధికారులు వంద రోజుల పని ఎందుకు కల్పించడంలేదని అధికారులను ఎన్నిమార్లు నిలదీసిన మండల అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు.

ఏళ్ళు గడుస్తున్న అధికారులు ఉపాధి హామీ పనులు కల్పించక పోగా ఉపాధి కార్డులు అందించని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకొని, ఉపాధి చట్టం ప్రకారం పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఉంది. అట్టి డబ్బులు ఇప్పించాలని లేకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇట్టి విషయంపై మన తెలంగాణ వివరణ కోసం ఎపిఓ యాకాంబ్రంకు పోన్ చేయగా అందుబాటులో లేదని వచ్చింది.

The collector does not show compassion on Surah Tanda