Home మెదక్ ప్రజలపై కాంగ్రెసోళ్ల మొసలి కన్నీరు

ప్రజలపై కాంగ్రెసోళ్ల మొసలి కన్నీరు

Congress is the crocodile tears on the people

మనతెలంగాణ/నర్సాపూర్ : అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రజలు, అధికారం పోయాక, ప్రభుత్వం  ప్రజలను పట్టించుకోవడం లేదంటు, కాంగ్రెసోళ్లు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని, మంత్రి హరీశ్‌రావ్ అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 10 వేల ఎకరాలులో కూడ, రెండు పంటలకు  సింగూరు కాలువ నీళ్లు ఇవ్వని  కాంగ్రెస్ ఇప్పుడు పంటలకు నీరు ఇవ్వాలంటు ధర్నాలు చేయడం వింతగా  ఉందన్నారు.  ప్రజల తాగునీటి అవసరాల దృష్టా సింగూరు నీటిని కాపాడుతున్నామని, టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 21 వేల ఎకరాలకు  మూడు పంటలకు నీళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో సింగూరు నీళ్లను మెదక్, నిజమాబాద్ జిల్లాలకు ఇవ్వాల్సి ఉండగా, హైద్రాబాద్‌కు తరలించి ఇక్కడి రైతులను  ఇబ్బందులకు గురిచేసిందని కాంగ్రెస్ అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవాలన్న  కాంగ్రెస్ ఎత్తు గడలను, తెలంగాణ ప్రభుత్వం చిత్తు చేస్తుందని, తెలంగాణ అభివృద్ధే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని మంత్రి హరీశ్‌రావ్ అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపి కొత్తప్రభకర్‌రెడ్డి,ఎమ్మెల్యే మదన్‌రెడ్డి,దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.